దాతృత్వం చాటిన సర్పంచ్ రామచంద్రారెడ్డి.


తిరుచానూరు గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ రామచంద్రారెడ్డి ఒక బాలుడి శస్త్రచికిత్స కొరకు 50 వేల రూపాయలు నగదును అందించి .దాతృత్వం చాటారు.తిరుచానూరు శంకర్ నాయుడు కాలనీలో నివాసం వున్నటువంటి ఎనిమిది సంవత్సరాల పి.జ్యోతిష్ అనే బాలుడు వాషింగ్ మిషన్ తిరుగుతూ వుండగా అందులో చేయి పెట్టండంతో చూపుడు వేలు తెగిపడి తీవ్ర గాయము అయినది.వెంటనే తల్లతండ్రులు తిరుపతిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రి నందు తమ పిల్లవాడిని చేర్చారు. వారు శస్త్రచికిత్స కు సుమారు లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని తెలపడంతో ఆర్థిక స్తోమత లేని తల్లి తండ్రులు తమకు ఎదురైన పరిస్థితికి విలపించారు.అనంతరం తమ గ్రామ సర్పంచ్ రామచంద్రారెడ్డి కి జరిగిన ఘటనను వివరించి సహాయం చేయవలసినదిగా కోరారు.వెంటనే చలించిన ఆయన వారికి 50వేల రూపాయలు నగదుని సహాయంగా అందించి దాతృత్వం చాటారు.అదే విధంగా తిరుచానూరు ప్రజాశక్తి విలేకరి మోహన్ మరియు తన మిత్రులు నిరంజన్,మునిశేఖర్,హిమాలయన్ హరి,ప్రసాద్,పవన్ లతో కలసి సుమారు 8 వేల రూపాయలు నగదు పిల్లవాడి తల్లి వద్ద అందించి తమ వంతు సహాయాన్ని చాటారు.పెద్ద మనసుతో సహాయం చేసినందు రామచంద్రారెడ్డికి మరియు ఇతర దాతలకు జోతిష్ తల్లితండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.

About The Author