ర‌జినీకాంత్ అమెరికాకు ప్ర‌త్యేక విమానంలో..


సూప‌ర్‌స్టార్‌ త‌లైవా ర‌జినీకాంత్ అమెరికాకు ప్ర‌త్యేక విమానంలో బ‌య‌లుదేరారు.
ఇంత‌కీ త‌లైనా యు.ఎస్‌కు ఎందుకు వెళ్లార‌నే వివ‌రాల్లోకెళ్తే కొవిడ్ సెకండ్ వేవ్ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు దేశాల‌కు విమాన రాక‌పోక‌ల‌పై నిషేధం విధించింది.
ఈ నేప‌థ్యంలో ఆరోగ్య చికిత్స నిమిత్తం ర‌జినీకాంత్ ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర ప్ర‌త్యేక అనుమ‌తి తీసుకుని కుటుంబంతో స‌హా అమెరికా వెళ్లారు. అది కూడా ప్ర‌త్యేక విమానంలో.
అస‌లు కొవిడ్ ప‌రిస్థితుల్లో తలైవా ఎందుకు అమెరికా వెళ్లార‌ని అభిమానులు టెన్ష‌న్ ప‌డుతున్నారు.
అయితే ఎప్ప‌టి నుంచో ట్రీట్‌మెంట్ కోసం ర‌జినీకాంత్ అమెరికా వెళ్లాల‌నుకుంటున్నార‌ని, అందుకోస‌మే ఆయ‌న ముందుగా అణ్ణాత్త షూటింగ్‌ను పూర్తి చేసి మ‌రీ వెళ్లార‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

About The Author