ఇండికేటర్ వేసినా ఫలితం లేదు.. వీళ్లు మారరా?
రోడ్డుపై అతి వేగం ప్రమాదకరం అని, నెమ్మదిగా వెళ్లాలని తెలిసినా కొంత మంది మారడం లేదు. రద్దీ రోడ్లపై, కూడళ్లలో ఇండికేటర్లు వేసినా పట్టించుకోకుండా వెనుక నుంచి ఓవర్ టేక్ చేసుకుంటూ ఓవర్ స్పీడ్‌లో వెళ్లిపోతున్నారు. సంగారెడ్డిలో ఈ ఓవర్ స్పీడ్ వల్ల తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎవరో ఒకరు గాయాలపాలవుతూనే ఉన్నారు.శుక్రవారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రి నుంచి బైక్‌పై వెళ్తున్నారు. కొత్త బస్టాండ్ దగ్గర ఇండికేటర్ వేసి టర్నింగ్ తీసుకుంటుండగా, వెనుక నుంచి ఇద్దరు స్కూటీపై వేగంగా వచ్చి ఢీకొట్టారు. అసలే ఒకరికి కాలు విరిగి ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా.. వేరొకరి అతివేగం వల్ల ఆ వ్యక్తి మళ్లీ గాయాలపాలయ్యాడు.