దొంగతనాలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకున్న పెదపారుపూడి పోలీసులు
కృష్ణా జిల్లా పెదపారుపూడి
*అతని వద్ద నుండి 3 ద్విచక్ర వాహనాలు, మరియు బంగారం తో కూడిన రుద్రాక్షతో కలిపి 1,84,000/- విలువ కలిగిన బంగారం స్వాధీనం*
_అందినకాడికి దొంగతనాలకు పాల్పడుతూ, ఆర్ పేట, పామర్రు, పెదపారుపూడి వంటి వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో కులిపనులు చేసుకుంటూ ద్విచక్ర వాహనాలు ఇతర విలువైన సొత్తును అపహరించడమే పనిగా పెట్టుకున్న దొంగను ఈరోజు పెదపారుపూడి పోలీసులు అదుపులోకి తీసుకొని అతనినీ కోర్టుకు పంపడమైనది._
_వివరాల్లోకి వెళితే పెదపారుపూడి ,ఆర్ పేట, పామర్రు పోలీస్స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న బందరు వాస్తవ్యుడైన మహమ్మద్ హుస్సేన్ ను పట్టుకోవడం కోసం జిల్లా ఎస్పీ శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పోలీసు అధికారులు ,సిబ్బంది బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఈరోజు పెదపారుపూడి ప్రధాన సెంటర్ వద్ద అతనిని గుర్తించి , గుడివాడ డి.ఎస్.పి సత్యానందం గారి ఆధ్వర్యంలో మేరకు పామర్రు సిఐ వెంకట్ నారాయణ గారు, పెదపారుపూడి ఎస్ఐ రంజిత్ కుమార్ గారు సిబ్బందితో కలిసి అతడిని అదుపులోకి తీసుకొని, అతడిని విచారించి అతని వద్ద నుండి 3 ద్విచక్ర వాహనాలను, బంగారంతో కూడిన రుద్రాక్ష తో కలిపి 1,84,000/- విలువ కలిగిన బంగారంను స్వాధీనం చేసుకున్నారు. అతడిని రిమాండ్ లోకి తీసుకొని, రిమాండ్ రిపోర్ట్ తో పాటు గుడివాడ పిడిఎం కోర్టుకు పంపడమైనది._
_ఈ కేసులో ముద్దాయి ని అదుపులోకి తీసుకోవడం లో ప్రధాన పాత్ర పోషించిన సిఐ గారిని, ఎస్ఐ గారిని, సిబ్బందిని డిఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు_