ఆలస్యమైనా ఆఖరికి న్యాయమే గెలుస్తుంది..నారా లోకేష్..


ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలు-కోర్టు తీర్పు నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణ
పై అభ్యర్థులతో చర్చా కార్యక్రమంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

 ఆలస్యమైనా ఆఖరికి న్యాయమే గెలుస్తుంది.
 న్యాయం కోసం పోరాడిన గ్రూప్-1 అభ్యర్థులందరికీ అభినందనలు.
 మీరు చేసిన పోరాటంతో మొదటి విజయం సాధించాం.
 గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది.ఇంటర్వ్యూలు కూడా నిలిపివేసింది.
 ఏపీపీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి వేలాది మందికి తీరని అన్యాయం చేశారు.
 దొడ్డిదారిలో తమ వారికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి చేసిన కుట్రలు బయటపడ్డాయి.
 వ్యాపం కుంభకోణం తరహాలోనే జగన్ రెడ్డి పాలనలో గ్రూప్-1 కుంభకోణం జరిగింది.
 అర్హులకు మాత్రమే ఉద్యోగాలు అనే నినాదంతో మన పోరాటం కొనసాగుతుంది.
 మీరు అడుగుతున్నవి న్యాయమైన డిమాండ్స్.రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి.
 మెయిన్స్ జవాబు ప‌త్రాల‌ను మాన్యువ‌ల్ వేల్యూష‌న్‌ చేయాలి.
 ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లు, అంద‌రి అభ్యర్థుల మార్కులను వెల్లడించాలి. ఇది వారి తదుపరి ప్రయత్నం కోసం, లోపాలు సరిచేసుకునేందుకు ఉపయోగపడుతుంది.
 డిజిటల్ వేల్యూష‌న్‌కి సంబంధించిన సాంకేతికత SOP పై శ్వేతపత్రాన్ని విడుదల చేయండి.
 ఎంపిక చేయని అభ్యర్థులందరి మార్కులు, వారి జ‌వాబు ప‌త్రాల‌ను విడుదల చేయాలి
 ఎంపిక ప్రక్రియ, వేల్యూష‌న్‌పై అనుమానాలున్న‌వారి ఫిర్యాదులు స్వీక‌రించేందుకు ఆన్‌లైన్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
 ఇప్పటికైనా ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి లేకపోతే అడ్డగోలుగా చేసిన తప్పులను న్యాయపరంగా ఎండగట్టి అంతిమ విజయం సాదిద్దాం.
 కోర్టు మొట్టికాయల తరువాత అయినా జగన్ రెడ్డి గారిలో మార్పు వస్తుందని భావించాను. కానీ మార్పు రాలేదు.
 ఎన్నికల ముందు జాబు రెడ్డిగా ఉంటానని హామీ ఇచ్చి ఇప్పుడు డాబు రెడ్డిగా మారారు.
 ఆయన రిలీజ్ చేసింది జాబ్ క్యాలెండర్ కాదు బిల్డప్ క్యాలెండర్.
 క్యాలెండర్ లో 365 రోజులుంటాయి.డాబు రెడ్డి గారి బిల్డప్ క్యాలెండర్ లో గ్రూప్1,2 పోస్టులు 36
 గ్రూప్1,2 పోస్టులు 36 పోస్టులు మాత్రమే ఇచ్చి డాబు రెడ్డి రికార్డ్ సృష్టించారు.
 చరిత్ర లో ఇంత తక్కువ పోస్టులు ఇచ్చిన ముఖ్యమంత్రిగా డాబు రెడ్డి పేరు రికార్డుల్లోకి ఎక్కింది.
 ఎన్నికల ముందు అధికారం రాగానే 2.30 లక్షల ఉద్యోగాలు అన్న డాబు రెడ్డి ఇప్పుడు 10 వేల పోస్టులు ప్రకటించి చేతులు దులుపుకున్నారు.
 నిరుద్యోగయువతని నట్టేట ముంచారు.
 డాబు రెడ్డి ని చూసి పోయే కంపెనీలే తప్ప వచ్చే కంపెనీలు లేవు.
 ప్రైవేట్ ఉద్యోగాలు ఎలాగో లేవు కనీసం ప్రభుత్వ ఉద్యోగం అయినా వస్తుంది ఏమో అని కోటి ఆశలు పెట్టుకున్న నిరుద్యోగయువత ఆశల పై నీళ్లు చల్లారు.
 రెండేళ్లలో ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చాం అంటూ ఫేక్ ప్రకటనలు ఇస్తున్నారు.
 కార్యకర్తలకు ఇచ్చిన వాలంటీర్ పోస్టులు,పేపర్ లీక్ చేసి అమ్ముకున్న సచివాలయ పోస్టులు,దశాబ్దాలుగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగాలు,కాంట్రాక్టు,అవుట్ సోర్సింగ్ ఇలా చెప్పుకుంటేపోతే మొత్తం దొంగ లెక్కలే.
 వాలంటీర్లు – 2.6 లక్షల మంది.‘వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా సేవ అందించడం. ఇది ఉద్యోగం కాదన్నది డాబు రెడ్డి గారే.మరి ఇప్పుడు ఉద్యోగాల లిస్టులో కలపడానికి సిగ్గు వెయ్యలేదా?90 శాతం వాలంటీర్ పోస్టులు కార్యకర్తలకే ఇచ్చాం అని ఏ2 రెడ్డి ప్రకటించారు.
 గ్రామ, వార్డు సచివాలయం – 1.21 లక్షలు.పేపర్ లీక్ చేసి, వైకాపా కార్యకర్తలకు అమ్ముకున్నారు.
 ఆర్టీసి ఉద్యోగులు – 58 వేల మంది వీరంతా దశాబ్దాలుగా ఉద్యోగం చేస్తున్నారు
 కోవిడ్ నియామకాలు – 26 వేలు.ఇవి తాత్కాలిక ఉద్యోగాలే.
 ఆప్కోస్ – 95 వేల మంది ఇందులో అత్యధికం మద్యం షాపుల్లో పని చేసే వారు.
 ఇవన్నీ తీసేస్తే నిజమైన అర్హులకు వచ్చిన ఉద్యోగాలు 15 వేల లోపే.అవి కూడా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కలిపి.
 ఈ రెండేళ్ళలో ఆంధ్రప్రదేశ్ యువతను డాబు రెడ్డి ఇలా మోసం చేసారు.
 అప్ప‌టి చీఫ్ సెక్ర‌ట‌రీ నీలం స‌హానీ గ్రూప్-1&2 పోస్టులు 907, పోలీస్ శాఖ‌లో 7740 ఖాళీలున్నాయ‌ని ప్ర‌క‌టిస్తే, డూబురెడ్డి బిల్డప్ క్యాలెండర్ లో గ్రూప్-1&2 పోస్టులు 36, పోలీస్‌శాఖ‌లో 450 పోస్టులున్నాయి. చీఫ్ సెక్ర‌ట‌రీ ప్ర‌క‌ట‌నకి చీఫ్ మినిస్ట‌ర్ ప్ర‌క‌ట‌ని మ‌ధ్య వేల ఉద్యోగాలు వైకాపా గెద్దలు ఎత్తుకుపోయాయా?
 2.30 లక్షల జాబులు ఎక్కడ డాబు రెడ్డి?పోలీస్ శాఖ లో ఏడాదికి 7వేల పోస్టుల భర్తీ అన్నావ్ ఎక్కడ డాబు రెడ్డి?
 క్యాలెండర్ లో డిఎస్సీ ప్రస్తావన కూడా లేకపోవడం మరీ దారుణం.క్యాలెండర్ లో టీచర్ పోస్టులు ఉంటాయని అనుకున్నారు.కానీ డాబు రెడ్డి డిఎస్సీ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు హ్యాండ్ ఇచ్చారు.
 డాబు రెడ్డి మాట తప్పాడు,మడమ తిప్పాడు.ఉన్న కంపెనీలను తరిమేసాడు,నిరుద్యోగ భృతి ఎత్తేసాడు,ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడు.
ఉద్యోగాలు లేక నిరుద్యోగ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
అనంతపురం లో రాజేశ్వరి అనే యువతి ఉద్యోగం లేక ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకుంది.
చంద్రబాబు గారి హయాంలో ఒక్క ప్రైవేట్ రంగంలోనే 5.13 లక్షల ఉద్యోగాలు కల్పించాం.ఇది వైకాపా ప్రభుత్వమే ప్రకటించింది.
ఉన్న కంపెనీలను కూడా వైకాపా ప్రభుత్వం తరిమేస్తుంది
 నిరుద్యోగ యువతని నడి రోడ్డు పై వదిలేసి డాబు రెడ్డి హ్యాపీగా తాడేపల్లి ప్యాలస్ లో పడుకున్నారు.
 రెండేళ్ల నుండి వేలాది రూపాయిలు ఖర్చు చేసి అభ్యర్థులు కోచింగ్ తీసుకుంటున్నారు.
 ఉన్న ఉద్యోగాలు సైతం వదులుకొని ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేవారు ఉన్నారు.
 ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తా అని మోసం చెయ్యడంతో ఎంతో మంది అభ్యర్థులు వయోపరిమితి మించిపోయి నష్టపోతున్నారు.
 రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగయువత రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు.
 గ్రూప్-1 పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకలు ఒకపక్క,ఉద్యోగాలు లేని బిల్డప్ క్యాలెండర్ మరోపక్క నిరుద్యోగయువత ని ఆందోళనకు గురిచేస్తున్నాయి.
 డాబు రెడ్డి గారు తక్షణమే యువతకు క్షమాపణ చెప్పాలి.అధికారం వచ్చిన వెంటనే 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి.
 అంతా దైర్యంగా ఉండండి.తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది.గ్రూప్-1 అభ్యర్థులకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటాం.నిరుద్యోగయువతకు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసే వరకూ పోరాడతాం.

About The Author