ఆయా రాశుల వారికి సంభవించు వ్యాధులు…

ఆయా రాశుల వారికి సంభవించు వ్యాధులు –

* మేషము –

తలనొప్పి, వాపులు వచ్చే వ్యాధులు , మెదడుకు సంబంధించిన రోగములు , మెదడువాపు వ్యాధి , సృహతప్పుట, నిద్రపట్టని వ్యాధి , మెదడులో రక్తనాళాలు పగులుట అనగా సెరిబ్రల్ హేమరేజ్ , బ్రెయిన్ ట్యూమర్, కోమా , మెదడులో జబ్బు కారణంగా వచ్చు జ్వరం వంటి సమస్యలు సంభవిస్తాయి.

మేషరాశి కోపమును , తొందరపాటును , పట్టుదల , దుడుకు చర్యలను సూచిస్తుంది. వీరికి మాంసాహారం ఎక్కువుగా పడదు. వీరు కోపమును ఉద్రేకమును కంట్రోల్ చేసుకోవడం అవసరం.

* వృషభం –

గొంతువ్యాధులు ముఖ్యముగా టాన్సిల్స్ వాపు వాటి వలన కలుగు ఇన్ఫెక్షన్ , గొంతువాపు , గొంతునొప్పి, మెడనొప్పి, మెడలోని నరాలు బిగదీసుకు పోవడం , గొంతు బొంగురు పోవడం , నాలుక పూత, నాలుకపై కురుపులు , దంతాల నొప్పి, దంతాలు పుచ్చడం , కంటి వ్యాధులు , ముఖము పొంగుట , మృగశిర 1 వ పాదం ముఖం పై గాయాలు , ముఖం పై రాళ్ళ దెబ్బలు , లాలాజలం ఉత్పత్తి అయ్యే గ్రంథుల కు జబ్బు, కళ్లు ఎర్రబడుట, కళ్ల కలక, కంటి వాపు , కంట్లో శుక్లాలు , స్వరపేటికకు వచ్చే జబ్బు , మూత్రపిండాల జబ్బు, మూత్రాశయపు జబ్బులు , మూత్రం వలన అంటు జబ్బులు వంటి సమస్యలు కలుగును.

* మిధునము –

ముఖ్యముగా ఊపిరితిత్తులకు సంబంధించిన అన్ని రోగములు , శ్వాసనాళాల వాపు , శ్వాసనాళాల నొప్పి, బ్రాంకైటిస్ , క్షయవ్యాధి , చెవి వ్యాధులు , ముఖ్యముగా కుడి చెవికి వచ్చు వ్యాధులు , చెవుడు, చెవినొప్పి, చెవిలో కురుపులు , చీముకారుట మొదలయిన సమస్యలు , లంగ్ క్యాన్సర్ , శ్వాసనాళములో కఫం గట్టిపడటం మొదలయిన సమస్యలు , జననేంద్రియ , సుఖవ్యాధులు , పాద సంబంధ సమస్యలు , రెక్టమ్ వంటి విసర్జకావయావాల సమస్యలు సంభంవించును.

* కర్కాటకం –

ఛాతినొప్పి, ఛాతిలో బరువుగా ఉండటం , ఆస్తమా , క్షయవ్యాది , జలోదరం , గ్యాస్ జబ్బు, మానసిక వ్యాధులు , అజీర్ణం పునర్వసు 4 వ పాదం పచ్చకామెర్లు , క్యాన్సర్ వ్యాధి , మతిచాంచల్యం , పుష్యమి నక్షత్రం గాల్ బ్లాడర్ లో రాళ్లు తగినంత పైత్యరసం ఉరకపోవడం వలన అజీర్ణం , పులుపు వలన ఇబ్బందులు , ఊపిరితిత్తుల జబ్బు, ఊపిరితిత్తులలో రాళ్లు , కండపెరుగుట , శ్వాసక్రియ సక్రమంగా లేకపోవటం ఆయాసం , జలుబులు, ముక్కులో కండలు పెరుగుట, ముక్కులో నొప్పి, శ్వాసకోశ వ్యాధులు , తాగుడు దాని మూలంగా కలుగు వ్యాధులు సంభవిస్తాయి.

* సింహము –

ముఖ్యంగా గుండెజబ్బులు , ముఖానక్షత్రం రక్తపోటు , గుండెదడ , గుండెలో కండరాల వాపు , గుండె వాల్వుల జబ్బు మరియు గుండె వాల్వులు చెడిపోవుట , జ్వరములు తలతిరగడం , కొలెస్ట్రాల్ అధికం అయ్యి రక్తనాళాలు మూసుకుపోవడం ముఖ్యంగా పుబ్బ నక్షత్రం వారికి ఇది చూపిస్తుంది. గుండెకి సంబంధించిన అన్నిరకాల వ్యాధులు , గుండె మార్పిడి , కాళ్లు పొంగడం , మోకాళ్ల వాపు , మోకాళ్ల నొప్పులు , మోకాలి చిప్ప వాపు మరియు నొప్పి , మూర్చ జబ్బు. వంటి సమస్యలు వస్తాయి.

* కన్య –

కడుపుకి సంబంధించిన సమస్త రోగములు , లివర్ , గాల్ బ్లాడర్ వ్యాధులు , డిసెంట్రీ , కడుపునొప్పి, అల్సర్లు , చిత్త 1 , 2 పాదములు పైత్యం, అల్సర్ , వాంతులు , పైత్య వికారం, తల తిరగడం వంటి వాటిని చూపిస్తాయి. కడుపులోని రక్తనాళాలకు జబ్బు, ఈ రాశి నుండి కుంభం 6 వది కావడం వలన పిక్కలు , చీలమండల వాపులు , నొప్పులు వీటిపైన దెబ్బలు తగలడం ముఖ్యంగా రాతి వలన దెబ్బలు , ప్రమాదాలు జరిగి తలకు దెబ్బలు తగలడం , ముఖం పగలడం , అజీర్ణవ్యాది , ఎక్కువ ఆహారం తినటం వలన కలిగే వ్యాధులు , కన్యారాశి జీర్ణం అయిన ఆహారం లో నుండి శక్తికి గ్రహించడం కలిసిపోవడం మరియు శక్తిని శరీరానికి ఉపయోగించేలా క్రియలు చేస్తుంది . కాబట్టి ఈ క్రియలకు అడ్డు కలిగించే వ్యాధులు , తాగుడు ( హస్తా నక్షత్రం ) దానివలన మత్తు కలిగి ప్రమాదాలకు గురి అవడం జరుగును.

* తుల –

మూత్రపిండాల జబ్బు, మూత్రపిండం మార్పిడి , మూత్రనాళాలలో రాళ్లు , మూత్రనాళాల వాపు , వెనక భాగం వీపు దిగువ భాగంలో తట్టుకోలేని విపరీతమైన నొప్పి , ముత్ర విసర్జనకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులు , మూత్రంలో గ్లూకోజ్ , యూరినరీ ఇన్ఫెక్షన్ , మూత్రపిండాల ఇన్ఫెక్షన్ వలన నొప్పి, అపెండిసైటిస్ , పాదాల వాపు , పాదాల వ్రేళ్ల వాపు , నొప్పులు , పాదాల ఇన్ఫెక్షన్ సమస్యలు కలుగును.

* వృశ్చికం –

బాహ్యజననేంద్రియాలకు సంబందించిన వ్యాధులు , మూత్రకృచ్చం , బ్లాడర్ వాపు , హైడ్రోసిల్ , బ్లాడర్ లో రాళ్లు , రతిక్రియ ద్వారా సంభవించు వ్యాధులు , గుదము , రెక్టమ్ వీటికి సంబంధించిన సమస్యలు , మూలవ్యాది, భగంధరం , గుదములో పుండ్లు , గర్భాశయ క్యాన్సర్ , అండాశయం యొక్క వ్యాధి , హెర్నియా , పొత్తి కడుపులో నొప్పి, తెల్లబట్ట , పసుపు బట్ట మొదలగు స్త్రీ జననేంద్రియ వ్యాధులు , గనేరియా , సిఫిలిస్ , ప్రొస్టేట్ గ్రంథి వాపు , గర్భాశయంకు శస్త్ర చికిత్స చేసి తీసివేయుట , విసర్జన సక్రమంగా జరగకపోవటం , అనురాధ నక్షత్రం వలన మలబద్దకం , గ్యాస్ సమస్య , నపుంసకత్వం , నరాల బలహీనత, తలలో కురుపులు , నిద్రలో నడుచుట, మత్తులోకి పోవటం , దీర్ఘనిద్ర , జననేంద్రియముల వద్ద చర్మవ్యాధి , ఫెలోపియన్ నాళాల వాపు , నిస్సంతానం వంటి సమస్యలు కలుగును.

* ధనస్సు –

కీళ్లవాతం, ధనుర్వాతం, సయాటిక, పిక్కలు , తొడలు నొప్పి, వాటి ఎముకలు విరుగుట , పిరుదులపైన కురుపులు , నడుమునొప్పి, తొడలలో వచ్చు తొడపాము అనే జబ్బు , గౌట్ జబ్బు కలుగును. పూర్వాషాడాలో చంద్ర , గురు , శుక్రులలో ఎవరైనా ఒక్కరు ఉన్నను మధుమేహం కలుగచేస్తారు . ఉత్తరాషాడ 1 వ పాదం వలన పిరుదులపైన శగ కురుపులు , మూలా నక్షత్రం వలన ఎక్సరేకి కూడా చిక్కని అంతుదొరకని నడుమునొప్పితో ఇబ్బంది పడతారు. కీళ్లవాతాలు సంభంవించును.

* మకరం –

మోకాళ్ళ నొప్పులు , వాపులు , ఎముకలు విరుగుట, చర్మవ్యాదులు ఎగ్జిమా , కీళ్లవాతం , జలుబులు , శ్వాశకోశ వ్యాధులు , శ్వాశ పీల్చలేకపోవడం ఆయాసం , గుండెవ్యాధులు సంభంవించును.

* కుంభం –

గుండె వ్యాధులు , చెవి వ్యాధులు , ముఖ్యంగా ఎడమచెవి సమస్యలు , కాళ్లవాపు , చీలమండల వాపు , రక్తపోటు , బోదకాలు , చర్మవ్యాదులు , మలబద్దకం , అజీర్ణవ్యాధులు , రక్తప్రసరణ సరిగ్గా లేకపోవటం , చిగుళ్లవాపు , నొప్పి , శ్వాసనాళంలో అన్య వస్తువు లేక కండరం పెరగటం , శ్వాసక్రియకు అడ్డుతగలడం వంటి సమస్యలు కలుగును.

* మీనము –

తాగుడుకు బానిస అవ్వడం , గ్యాస్ట్రిక్ సమస్యలు , పాదముల వాపు , నొప్పులు , మడమల పగుళ్లు , మడమశూలలు , అరికాలిలో కురుపులు , పాదాలకు ఎక్కువ చెమట పట్టడం , పాదాలలో ఆనెలు కలుగును. పూర్వాభాద్ర 4 వ పాదం వలన లివర్ సమస్యలు , ఉత్తరాబాద్ర కారణమున పచ్చకామెర్లు , వాతం , లివర్లో రాళ్లు , లివర్ పెరగటం , రేవతి వలన నరాల జబ్బులు , పాదాల వాపు కలుగును. ముఖ్యంగా పాదాలకు సంబంధించిన సమస్యలు ఎక్కువ కలుగును.

ఇప్పటి వరకు మీకు నేను ఆయా రాశుల వారికి కలుగు వ్యాధుల గురించి తెలియచేశాను మన వ్యక్తిగత జాతకం అనుసరించి ఆయా గ్రహస్థితుల స్థానాన్నిబట్టి మనుష్యులకు రోగాలు వచ్చును. రాబోయే మరికొన్ని పొస్టులలో నక్షత్రాల వలన ఆయా నక్షత్రాల వారికి కలుగు వ్యాధులను వివరిస్తాను.

ఆయా రాశుల వారు తమ అనారోగ్యాలను ముందుగానే గుర్తించి సరైన చికిత్సలు తీసుకోవడానికి ఈ పోస్టు పెట్టాను .

గమనిక –

నేను రాసిన ” ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు ” మరియు ” ఆయుర్వేద మూలికా రహస్యాలు ” రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. ఈ గ్రంథాలలో మొక్కలను సులభముగ గుర్తించుటకు మొక్కల చిత్రాలు రంగులలో ఇవ్వడం జరిగింది.

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది .వెల – 350 రూపాయలు .

ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది. వెల – 450 రూపాయలు కొరియర్ చార్జీలు కలుపుకొని

ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్

9885030034

మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

కాళహస్తి వేంకటేశ్వరరావు .

అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

9885030034

About The Author