రాయ‌ల‌సీమ ప్రాజెక్టు ప‌నులు ఆపండి : కృష్ణా రివ‌ర్ మేనేజ్‌మెంట్ బోర్డ్


ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అక్ర‌మంగా నిర్మిస్తున్న రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై తెలంగాణ ప్ర‌భుత్వం రాసిన లేఖ‌కు కృష్ణా రివ‌ర్ మేనేజ్‌మెంట్ బోర్డు స్పందించింది. రాయ‌ల‌సీమ లిఫ్ట్ ఇరిగేష‌న్ ప‌నులు త‌క్ష‌ణ‌మే ఆపాలంటూ ఏపీ ప్ర‌భుత్వానికి లేఖ రాసింది. నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ ( ఎన్జీటీ ) గ‌త ఫిబ్ర‌వ‌రిలో ఇచ్చిన ఆదేశాల‌లో రాయ‌ల‌సీమ లిఫ్ట్ ఇరిగేష‌న్ ప‌నులు చేప‌ట్ట‌వ‌ద్ద‌ని స్ప‌ష్టంగా చెప్పార‌ని కృష్ణా న‌ది యాజమాన్య బోర్డు లేఖ‌లో ప్ర‌స్తావించింది.

కేఆర్ఎంబీ నిపుణుల క‌మిటీ ప‌ర్య‌ట‌న‌కు ఏపీ ప్ర‌భుత్వం అవ‌కాశం క‌ల్పించ‌డం లేదు. దీనిపై తెలంగాణ ప్ర‌భుత్వం కృష్ణా రివ‌ర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. అయితే డీపీఆర్‌లు స‌మ‌ర్పించి ఆమోదం పొందే వ‌ర‌కు రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌నులు ముందుకు వెళ్లొద్దు అని ఏపీ ప్ర‌భుత్వానికి కృష్ణా రివ‌ర్ మేనేజ్‌మెంట్ బోర్డు స్ప‌ష్టం చేసింది.

About The Author