మహిళల భద్రత – మనందరి బాధ్యత
_ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీఐజీలు, జిల్లాల ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్ లు , సబ్ ఇనస్పెక్టర్ లు మరియు దిశ పోలీస్ స్టేషన్ అధికారులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌరవ శ్రీ గౌతమ్ సవాంగ్ IPS గారు మహిళా భద్రత కోసం చేపట్టవలసిన కార్యచరణ, వారి రక్షణ కోసం రూపొందించిన దిశ యాప్ పై అవగాహన కార్యక్రమాలు మొదలైన అంశాల గురించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా పోలీసు కార్యాలయం నుండి జిల్లా ఎస్పీ శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపిఎస్ గారు, అడిషనల్ ఎస్పీ శ్రీమతి మలిక garg ips గారు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు, ఏఆర్ సత్యనారాయణ గారు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు_
_రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కార్యక్రమంలో భాగంమైన మహిళల భద్రత లో భాగంగా తీసుకోవాల్సిన చర్యలు, దిశ యాప్ పై మహిళల్లో అవగాహన… ప్రతీ మహిళ ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయాల్లో సేవలు వినియోగించుకునేలా చైతన్యం చేయడం, మహిళా రక్షణ చట్టాలపై అవగాహన, మొదలగు అంశాలపై డిజిపి గారు దిశానిర్ధేశం చేశారు. అంతేకాకుండా పోలీస్ అధికారులు సిబ్బంది తో పాటు, మహిళా పోలీసులను, వాలంటీర్లను, మహిళా మిత్ర కార్యదర్శులను, అందరిని ఇందులో భాగస్వాములను చేస్తూ దిశ యాప్ లో ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ ఫోన్ నందు డౌన్ లోడ్ చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు ముమ్మరం చేయాలని తెలిపారు._
_ఎస్పీ గారు మాట్లాడుతూ మహిళల భద్రత మనందరి బాధ్యత అని, దానికి ప్రతి ఒక్క పాఠశాలలు, కళాశాలలు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి, దిశ యాప్ యొక్క ఉపయోగం, పనితీరు మొదలైన అంశాల గురించి పూర్తి అవగాహన కల్పిస్తామని, వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దిశా మహిళా పోలీస్ స్టేషన్ లో సమస్యతో వచ్చినవారికి తక్షణ పరిష్కారం అందించేలా కృషి చేస్తామని, వారి భద్రతకు మరింత భరోసా కల్పించేలా కార్యాచరణ, ప్రణాళికలు రూపొందిస్తామని తెలియజేశారు. ఇప్పటికే జిల్లాలో దిశ యాప్ వల్ల రక్షణ పొందిన మహిళలు ప్రత్యేక ధన్యవాదాలు పోలీసుశాఖకు తెలియజేశారని, దిశ యాప్ గురించి తెలియని మారుమూల ప్రాంతాల్లో సైతం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని అన్నారు._
_ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచి డిఎస్పి ధర్మేంద్ర గారు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రమణగారు, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ గారు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు_