ఉదయం టిఫిన్ తిని స్నానం చేస్తున్నారా?…. అయితే రిస్క్ లో పడినట్టే..!


ప్రతిరోజు ఉదయం కొంతమంది బ్రేక్ ఫాస్ట్ (అల్పాహారం) స్కిప్ చేస్తూ ఉంటారు అయితే పోషకాహార నిపుణులు మాత్రం బ్రేక్ ఫాస్ట్ (అల్పాహారం) తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు. ఇలా బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. పిల్లలైనా పెద్దలైనా ఉదయం బ్రేక్ఫాస్ట్ తప్పనిసరి. అయితే మారిన జీవన శైలి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ టిఫిన్ విషయంలో ఒక పెద్ద తప్పు చేస్తున్నారు.నిద్ర లేవగానే బ్రష్ చేసుకుని టిఫిన్ చేసేస్తూ ఉంటారు ఆ తర్వాత స్నానం చేసి ఆఫీస్ లేదా స్కూల్ కి వెళ్తూ ఉంటారు. మనలో చాలామంది ఇలా చేస్తూ ఉంటారు. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత స్నానం చేయకూడదు ఎందుకంటే అలా స్నానం చేయడం వలన శరీర ఉష్ణోగ్రత తగ్గి ఆ ప్రభావం జీర్ణ వ్యవస్థ మీద పడి తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాక గ్యాస్ కడుపు ఉబ్బరం అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.

కాబట్టి కాస్త ఓపిక చేసుకుని స్నానం చేసిన తర్వాత టిఫిన్ చేయండి. స్నానం చేసిన తర్వాత టిఫిన్ చేస్తే తీసుకున్న టిఫిన్ బాగా జీర్ణం అయ్యి మెదడు చురుగ్గా పని చేసి రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఆయిల్ ఫుడ్స్ కాకుండా తీసుకుంటే మంచిది. ఆయిల్ ఫుడ్స్ వారంలో ఒకటి రెండుసార్లు తీసుకోవచ్చు.

About The Author