పుంగనూరు పరభుత్వాసువుత్రిలో ఇద్దరు నర్సులను సరండర్‌ చేస్తూ ఉత్తర్వులు.


పుంగనూరు పరభుత్వాసువుత్రిలో ఇద్దరు నర్సులను వైద్యవిదానపరిషత్‌కు సరండర్‌ చేస్తూ ఉత్తర్వులు.జిల్లా కలె క్టర్‌ హరినారాయణ్‌

రోగులకు వైద్య సేవలు అందించాల్సిన నర్సులు ఆధిపత్యం కోసం గొడవలు పడి వైద్యులపై తిరుగుబాటు చేసి, వైద్యసేవలకు అంతరాయం కలిగించడంతో ఇద్దరు నర్సులను అమరావతిలోని వైద్యవిదానపరిషత్‌కు సరండర్‌ చేస్తూ జిల్లా కలె క్టర్‌ హరినారాయణ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.పుంగనూరు ప్రభుత్వాసుపత్రిలో హెడ్‌నర్స్ గా పని చేస్తున్న మధుబాల, స్టాఫ్ నర్సుగా మనిచేస్తున్న పద్మావతి లు మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ చిర్మిలపై తిరుగుబాటు చేయడం, అసత్య ఆరోపణలతో పిటిషన్లు పెట్టుకోవడం, ఆసుపత్రి వద్ద బయటివ్యక్తులతో అల్లర్లు, ధర్నాలు చేయించారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గ కేంద్రంలో ఇలాంటి కార్యక్రమాలు జరగడంపై మంత్రి అగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు వైద్యసేవలు అందించాల్సిన సిబ్బందే ఇలాంటి ఆగడాలు చేయడంతో ఆగ్రహించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లాకలెక్టర్‌కు ఆసుపత్రిలో జరుగుతున్న తీరుపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అలాగే మరో ఇద్దరు నర్సులు ఆసుపత్రిలో బాలింతల వద్ద డబ్బులు వసూలు చేయడం, చీటీలు వేసి వడ్డీల వ్యాపారం చేయడంపై కూడ కలెక్టర్‌కు నివేదికలు అందింది. ఇందులో భాగంగా మధుబాల, పద్మావతిలపై వేటు వేశారు. వీరిద్దరిని ప్రభుత్వానికి సరండర్‌ చేశారు. మరో ఇద్దరు నర్సులపై కూడ చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు మెడికల్‌ ఆఫీసర్‌ చిర్మిల బుధవారం ఈ ఇద్దరు నర్సులను రిలీవ్‌ చేశారు.

About The Author