ఎండు ద్రాక్షతో ఎన్నో ప్రయోజనాలు…


కిస్ మిస్ (ఎండు ద్రాక్ష)లో గింజలుoడవు. చిన్న సైజులో, మధురమైన రుచిలో కాయలుంటాయి. తత్త్వాన్ని సున్నిత పరుస్తుంది. కిస్మిస్ త్రిదోషాలను హరించి మేహన్ని శాంతింపచేసి, వీర్యవృద్ధి రక్తవృద్ధి చేస్తుంది. శరీరానికి, హృదయానికి బలాన్నిస్తుంది. కంఠాన్ని శుభ్రపరిచి, దగ్గు తగ్గిస్తుంది.
మూలవ్యాధిని తగ్గిస్తుంది. సాఫీగా విరేచనమయ్యేలా చేస్తుంది. పచ్చవి కొంచెంగా ఆకలిని తగ్గించి మేహశాంతి చేసి నోటికి రుచి కల్గిస్తాయి. క్షయవాధి నివారణకు ఇది ఉపకరిస్తుంది. కిస్ మిస్ 80 శాతం చక్కెరలుంటాయి. నీరసానికిది గొప్ప టానిక్ వంటిది.రక్తవృద్ధి చేస్తుంది. కనుక క్షయవ్యాధిగ్రస్తులకు ఇది వరప్రసాదంగా పనిచేస్తుంది. ఏ వ్యాధి గురించి ఔషధాలు వాడుతున్నా, కిస్మిస్ తీసుకుంటే, ఆ ఔషధాల పనితీరును మెరుగుచేసి శరీరానికి మేలు చేస్తుంది. చరకుని అభిప్రాయంలో ఎండిన ద్రాక్ష అమృతతుల్యమయినది.
ఇతర ఆహార పదార్థాలు అన్నీ మానివేసి, కేవలం ఎండిన ద్రాక్ష ఆహారంగా రెండు మాసాలు తీసుకుంటే, ఎటువంటి దీర్ఘవ్యాధులయినా తగ్గుతాయని చరక సంహితలో పేర్కొన్నారు. గుప్పెడు కిస్మిసన్ను శుభ్రంగా కడిగి, ఒక గ్లాసు నీటిలో లేక పాలలో లేదా పెరుగులో వేసి రాత్రంతా నాననిచ్చి, ఉదయాన వాటిని బాగా పిసికి కలిపివేసి తీసుకుంటే ఏ సంతులిత ఆహారానికీ తీసిపోని పౌష్టికత దీనిలో దొరుకుతుంది. నీటితో నానబెట్టి పిసికి ఉదయం త్రాగుతుంటే చర్మవ్యాధులు తగ్గుతాయి.
మనం తీసుకునే ఆహారపదార్థాలలో ఎక్కడ వీలయితే అక్కడ సాధ్యమయినన్ని కిస్మిన్లను కలుపుకోవడమనే అలవాటును చేసుకుంటే, ఎన్నో విపత్కర అనారోగ్యాలనుండి మనల్నిమనంరక్షించుకున్నట్లవుతుంది. అజీర్ణం, మలబద్దం ఇవి రెండూ ప్రతిరోజూ కిస్మిస్ తినేవారినుండి దూరంగా పారిపోతాయి. కిస్మిస్ శరీరాన్ని చురుకుగా మారుస్తుంది. దాంపత్య సుఖాన్ని ఇనుమడింప చేస్తుంది.
కిస్మిస్ ఐరన్, కాల్షియమ్ అధికంగా వున్నాయి. అందువలన ఇది రక్తవృద్ధి చేస్తుంది. ఎముకలకు దృఢత్వాన్ని కల్గిస్తుంది, స్త్రీలలో మధ్య వయసులో వచ్చేఅస్టియో పొరో సి స్ అనే ఎముకల గుల్ల బారడం నివారణా ఇది అద్భుతముగా పనచేస్తుoది. శరీరములో సహజముగా రోగ నిరోధకశక్తి ఇనుమడిస్తుంది
లోబిపి, మరియు రక్తం తక్కువ గా ఉన్న వాళ్ళు రోజు సాయంత్రం కిస్ మిస్-20, అంజిరా-2, ఎండు ఖర్జూరం-2 అర గ్లాసు నీళ్ళలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపున, తిని ఆ నీళ్ళు త్రాగాలి,40 రోజులు.

About The Author