మదనపల్లి – తిరుపతి రహదారికి మహర్ధశ…
చిత్తూరు జిల్లా,( 9స్టార్ట్ టీవీ) July 27. రాజంపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ పి వెంకట మిథున్ రెడ్డి అవిరళ కృషి, శ్రమ, పట్టుదలతో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మదనపల్లి – తిరుపతి నాలుగు వరసల జాతీయ రహదారికి మహర్ధశ..
ఈ రహదారి కోసం కేంద్ర రహదారులు మరియు ఉపరితల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కారీ తో మాట్లాడి మరియు ఉన్నతాధికారులుతో సమన్వయ పరిచి అనుమతులు మంజూరు చేయించారు.
శానిటోరియం, CTM, వాయల్పడు, కలికిరి, పీలేరు వంటి పట్టణాల నందు బైపాస్ లు నిర్మిస్తారు. నిధులు కూడా విడుదల చేశారు… ఆగష్టు లేదా సెప్టెంబరు నెల లోపల టెండర్లు పిలుస్తారు. రెండు నెలలు లోపల పని కూడా ప్రారంభమవుతుందని రాజంపేట ఎంపీ పీవీ మిధున్ రెడ్డి తెలిపారు. ఈ రహదారి వలన ప్రమాదాలు తగ్గి, తక్కువ ప్రయాణ సమయంలో త్వరగా గమ్యం చేరుకుంటారని, మరియు పరిసర గ్రామాల అభివృద్ధి జరుగుతుందని ఎంపీ తెలిపారు. ఎంతో కృషితో, పట్టుదలతో శ్రమించి రహదారి మంజూరు చేయించినందుకు పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి కి పీలేరు, మదనపల్లి నియోజకవర్గ ప్రజలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు..