చైనా లో ఇప్పుడు మరోసారి కరోనా కలకలం
కరోనాకు చైనా పుట్టినిల్లన్న సంగతి తెలిసిందే. అసలు కరోనాను చైనాయే పుట్టించి ప్రపంచం మీదకు వదిలిందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే వాటికి ఆధారాలు లేవు కాబట్టి ఏమీ చేయలేం. అయితే కరోనా మొదట చైనాలోనే వెలుగు చూసినా.. ఆ దేశంలో మాత్రం అంతగా వ్యాపించ లేదు. ఆ దేశంలో కరోనా మరణాలు కూడా ఇండియా, అమెరికా వంటి దేశాలతో పోల్చుకుంటే చాలా తక్కువ. అలాంటి చైనాలో మళ్లీ ఇప్పుడు మరోసారి కరోనా కలకలం రేగుతోంది.కరోనా వైరస్ మహమ్మారి రూపాలు మార్చుకుంటూ విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. అందులో డెల్టా వేరియంట్ ప్రపంచానికే ప్రమాదకరంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ డెల్టా వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలకు వ్యాపించింది.ఇక తాజాగా ఈ డెల్టా వేరియంట్ చైనాలోకి అడుగు పెట్టింది. చైనాలో దీని ప్రభావంతో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరగుతున్నాయట. దీంతో ఇప్పుడు చైనా మరోసారి వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. భారీగా కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేయిస్తోంది.చైనాలోని పలు ప్రావిన్సుల్లో ఈ డెల్టా వైరస్ కనిపిస్తోందట. ఇటీవల బీజింగ్‌లో డెల్టా వ్యాప్తిని గుర్తించిన అధికారులు తాజాగా తూర్పు చైనా జియాంగ్సూ ప్రావిన్సులోని ఈ డైల్టా వేరియంట్ ను గుర్తించారట. నాంజింగ్ ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్న తొమ్మిది మంది పారిశుద్ధ్య కార్మికులకు డెల్టా వేరియంట్ సోకినట్టు నిర్థారించారు. ఇకవారితో సన్నిహితంగా మెలిగిన వారిలో 200 పాజిటివ్ వచ్చిందట. ఈ నాంజింగ్ నగరంలో ఇటీవల ఒక్కరోజే 18 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయట.
చైనాలో కొత్తగా కనిపించేవన్నీ డెల్టా వేరియంట్ కేసులేనట. అంతే కాదు.. వైరస్ బారినపడి వారంతా వ్యాక్సిన్ తీసుకున్న వారేనట. దీంతో ఇప్పుడు చైనా కరోనా కట్టడికి మరోసారి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే చైనాలో 150కోట్ల టీకా డోసులు ఇచ్చారు. ఇక ఇప్పుడు బూస్టప్ డోస్ కూడా ఇవ్వాలని నిర్ణయించారు.