మందుబాబులకు షాక్, ఆ 2 రోజులు వైన్‌షాప్‌లు బంద్

తెలంగాణ:రాష్ట్రవ్యాప్తంగా బోనాల పండుగ ఉత్సవాలు కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా సాగుతున్నాయి. ఇక హైదరాబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లను చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే (ఆది,సోమ) రేపు, ఎల్లుండి హైదరాబాద్‌ నగరం పరిధిలోని మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, అలాగే బార్‌ అండ్‌ రెస్టారెంట్లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు తెలంగాణ ఎక్సైజ్‌ అండ్‌ ఆబ్కారీ శాఖ అధికారులు.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. బోనాలు, ఫలహారబండ్ల ఊరేగింపు, మరియు రంగం కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని మద్యం దుకాణాలు మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది తెలంగాణ ఎక్సైజ్‌ అండ్‌ ఆబ్కారీ శాఖ.

About The Author