తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప‌రిపాలనా భ‌వ‌నం ట్రెజ‌రీ విభాగంలో ఈవో త‌నిఖీలు

తిరుప‌తి, 2021 జూలై 31తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప‌రిపాలనా భ‌వ‌నంలోని ట్రెజ‌రీ విభాగాన్ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి శ‌నివారం త‌నిఖీ చేశారు. భ‌క్తులు స‌మ‌ర్పించిన కానుక‌లను లెక్కించే విధానం, వాటిని భ‌ద్ర‌ప‌రిచే ఏర్పాట్లు, భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం నూత‌నంగా నిర్మించిన ట్రెజ‌రీ భ‌వ‌నాన్ని ప‌రిశీలించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.  ప‌ర‌కామ‌ణి విధుల‌కు హాజ‌ర‌య్యే సిబ్బంది ప్ర‌వేశ‌, నిష్క్ర‌మ‌ణ మార్గాలను ప‌రిశీలించారు. ట్రెజ‌రీ కార్యాల‌య ప్ర‌ధాన ద్వారం ముందు సిబ్బంది దుస్తులు మార్చుకునేందుకు, భ‌ద్ర‌తా సిబ్బంది కోసం నిర్మించిన గ‌దుల గురించి అడిగి తెలుసుకున్నారు. త‌గిన‌న్ని సిసి కెమెరాలు, కార్యాల‌యం చుట్టూ ఏవిధమైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌ట్ట‌నున్నామ‌నే విష‌యాన్ని సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి ఈవోకు వివ‌రించారు.ఈవో వెంట ఎఫ్ఏ అండ్ సిఏవో శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, అద‌న‌పు ఎఫ్ఏ అండ్ సిఏవో శ్రీ ర‌విప్ర‌సాదు, ట్రెజ‌రీ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.

About The Author