ఆర్టీసీ బస్టాండ్ ఆవరణములో కరోనా పాజిటివ్ మరియు బ్లాక్ ఫంగస్ పేషెంట్ కలకలం

చిత్తూరు జిల్లా : పీలేరు;వాల్మీకిపురం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణములో కరోనా పాజిటివ్ మరియు బ్లాక్ ఫంగస్ పేషెంట్ స్పృహ లేకుండా పడి ఉండటంతో వాల్మీకిపురం ఆర్టీసీ బస్టాండ్ కంట్రోలర్ సింగం నర్సింహారెడ్డి   పై విషయాన్ని మా టీం సహారా చారిటబుల్ ట్రస్ట్ దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే మా టీం సభ్యులు స్పందించి 108 కు కాల్ చేసి ఈ విషయాన్ని చెప్పి, 108 సిబ్బంది  పోలీసులు మరియు  నాగమారాపల్లి వాలంటీర్ శ్రీ ఉషా గారి సహాయంతో పేషెంట్ ను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కి పంపించడం జరిగింది. తర్వాత వాల్మీకిపురం పంచాయతీ సిబ్బంది బస్ స్టాండ్ ఏరియా ని శుభ్రపరిచి శానిటేషన్ చేయడం జరిగింది, ఇందుకు  సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమంలో సహారా ట్రస్ట్ సభ్యులు సాధిక్ అహ్మద్, షాహిద్, షబ్బీర్, గౌస్ పోలీసు వారు పి జె ఖాన్, రిజ్వాన్ వాలంటీర్ ఉషా మరియు 108 సిబ్బంది పాల్గొనడం జరిగింది.

About The Author