ఫ్రెండ్‌షిప్ డే’ విషెస్.. కల్మషంలేని బంధం స్నేహం

రక్తం పంచుకున్న తోబుట్టువులు.. జీవితాంతం తోడు ఉంటారో లేదోగానీ.. స్నేహితులు మాత్రం మన నీడలా మనవెంటే ఉంటారు. చిన్న ఆపద వచ్చినా ఆదుకుంటారు. నేనున్నానని ధైర్యం నింపుతారు. అందుకే.. వారిని ఏడాదిలో ఒక్కసారైనా స్మరించుకోవడం మన ధర్మం. అందుకే, ఏటా ఆగస్టు మొదటి ఆదివారాన్ని ‘ఫ్రెండ్‌షిప్ డే’గా నిర్వహిస్తున్నారు. అయితే, ఈ రోజునే స్నేహితుల దినోత్సవంగా ఎంపిక చేయడానికి.. అమెరికాలో జరిగిన ఓ విషాద ఘటనే కారణమని చెబుతారు.

1935 సంవత్సరంలో అమెరికాకు చెందిన ఓ వ్యక్తి పోలీసుల కాల్పుల్లో చనిపోయాడు. తన స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేని అతడి స్నేహితుడు.. ఆగస్టు మొదటి ఆదివారం రోజున ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. వారి స్నేహానికి గుర్తుగా అమెరికన్ కాంగ్రెస్ ఆగస్టు తొలి ఆదివారాన్ని ‘ఫ్రెండ్ షిప్ డే’గా ప్రకటించిందని చెబుతారు. అయితే, ఈ ఘటనకు ముందు నుంచే ‘ఫ్రెండ్‌షిప్ డే’ ఉండేదని పలువురు వాదిస్తున్నారు. 1930లో ‘హాల్‌మార్క్‌’ సంస్థ తమ గ్రీటింగ్‌ కార్డులను విక్రయించాలనే ఉద్దేశంతో ఆగస్టు మొదటి ఆదివారాన్ని ‘ఫ్రెండ్‌షిప్ డే’గా సెలబ్రేట్ చేసుకోవాలని ప్రతిపాదించారని, అప్పటి నుంచి ఈ ట్రెండ్ నడుస్తోందని చెబుతున్నారు. అయితే, ఐక్యరాజ్య సమితి మాత్రం.. జులై 30వ తేదీని ‘అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం’గా ప్రకటించింది. కానీ, మన దేశంలో మాత్రం ఆగస్టు మొదటి ఆదివారాన్నే స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ కింది ‘ఫ్రెండ్‌షిప్ డే’ విషెస్‌తో మీ ప్రాణ స్నేహితులకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలపండి.

*నీ చిరునవ్వు మాత్రమే తెలిసిన మిత్రుని కన్నా.. నీ కన్నీళ్ల విలువ తెలిసిన మిత్రుడు మిన్న.

– హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే

*నీ మీద నీకే నమ్మకంలేని సమయంలో నిన్ను నమ్మినవాడే నీ మిత్రుడు.

– హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే

*స్నేహం అంటే భుజం మీద చేయి వేసి నడవడమే కాదు.. నీకెన్ని కష్టాలు వచ్చినా నేనున్నాని భుజం తట్టి చెప్పడం.

– హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే

*ఆపదలో అవసరాన్ని, బాధల్లో మనసుని తెలుసుకుని సహాయపడేవాడే నిజమైన స్నేహితుడు.

– హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే

*స్నేహం కోసం ప్రాణమివ్వడం కష్టమేమీ కాదు, అంతటి త్యాగం చేసే స్నేహితుణ్ని పొందడమే కష్టం.

– హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే

*నువ్వు లేకపోతే నేను లేను అనేది ప్రేమ.. నువ్వుండాలి నీతో పాటు నేనుండాలి అనేది స్నేహం.

– హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే

*భాష లేనిది, బంధమున్నది.. సృష్టిలో అతి మధురమైనది.. జీవితంలో మనిషి మరువలేనిది.. స్నేహం ఒక్కటే!

– స్నేహితుల రోజు శుభాకాంక్షలు

*ప్రేమ స్నేహాన్ని అడిగింది.. నేనున్న చోటు నువ్వెందుకు ఉండవని.

అప్పుడు స్నేహం ప్రేమతో ఇలా అంది.. ‘‘నీవు కన్నీరు మిగిల్చిన చోట నేను ప్రేమనందిస్తా!!’’ అని.

– స్నేహితుల రోజు శుభాకాంక్షలు

*ఒక్కోసారి ఓటమి కూడా మేలే చేస్తుంది. నిజమైన మిత్రులెవరో నీకు తెలిసేలా చేస్తుంది.

– స్నేహితుల రోజు శుభాకాంక్షలు

*కలలే జీవితానికి ఆధారం.. నమ్మకమే ఆశకు మూలం.. కష్ట సుఖాలను పంచుకోవడమే స్నేహానికి బలం.

– హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే

*నిజమైన స్నేహం మంచి ఆరోగ్యం లాంటిది.. పోగొట్టుకొనేంత వరకూ దాని విలువ తెలుసుకోలేం.

– హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే

*వంద మంది స్నేహితులు ఉండటం గొప్పకాదు.. వంద సమస్యలు తీర్చే ఒక్క మిత్రుడు ఉండటం గొప్ప.

– హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే

* మరుజన్మలోనూ నువ్వే నా స్నేహితుడివి కావాలి. మాటిస్తావా మిత్రమా..

– హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే

*”చీకటిపడితే.. మన నీడే మనల్ని వీడుతుంది.. కానీ, స్నేహం.. ఎప్పుడూ మనతోనే ఉంటుంది.

– స్నేహితుల రోజు శుభాకాంక్షలు

*మదిలోని మంచితనానికి మరణం లేదు. ఎదురు చూసే హృదయానికి ఓటమి లేదు. అనుక్షణం తపించే స్నేహానికి అవధులు లేవు.

– స్నేహితుల రోజు శుభాకాంక్షలు

*నీ కథలన్నీ తెలిసినోడు… మంచి స్నేహితుడు. ప్రతి కథలో నీతోపాటే ఉండేవాడు.. నీ బెస్ట్ ఫ్రెండ్!

– స్నేహితుల రోజు శుభాకాంక్షలు

* F – Few, R – Relations, I – In, E – Earth, N – Never, D – Die, ఈ భూమి కొన్ని బంధాలకు ఎప్పటికీ అంతం కావు.

– స్నేహితుల రోజు శుభాకాంక్షలు

*స్నేహం చేయడానికి తొందరపడొద్దు.. స్నేహం చేశాక ఎప్పటికీ వదలొద్దు.

– హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే

*స్నేహానికి కులం లేదు.. స్నేహానికి మతం లేదు.. స్నేహానికి హోదా లేదు… బంధుత్వం కంటే గొప్పది, వజ్రం కన్నా విలువైనది స్నేహం ఒక్కటే!

– స్నేహితుల రోజు శుభాకాంక్షలు

*నీ కళ్లలో కన్నీరులా జారి.. మనసులో భావంగా మారి.. నీ ఊపిరిలో శ్వాసగా చేరి.. ప్రాణం ఉన్నంత వరకు నీ స్నేహితుడిగానే ఉంటాను నేస్తమా!

– స్నేహితుల రోజు శుభాకాంక్షలు

*మరిచే స్నేహం చేయకు… స్నేహం చేసి మరవకు!

– స్నేహితుల రోజు శుభాకాంక్షలు

*మోసం చేసి స్నేహం చేస్తే తప్పులేదు. కానీ, మోసం చేయడానికే స్నేహం చేయకు!!

– స్నేహితుల రోజు శుభాకాంక్షలు

*కనులు నీవి.. కన్నీరు నాది. హృదయం నీది.. సవ్వడి నాది. ఈ స్నేహబంధం మన ఇద్దరిది!

– స్నేహితుల రోజు శుభాకాంక్షలు

* వెలుతురు ఉన్నప్పుడు ఒంటరిగా నడవడం కంటే.. స్నేహితుడితో చీకట్లో నడవటం ఉత్తమం – హెలెన్ కెల్లర్

– స్నేహితుల రోజు శుభాకాంక్షలు

*నీ గురించి అన్నీ తెలిసిన ఏకైక వ్యక్తి, ఇప్పటికీ నిన్ను ఇష్టపడేది నీ స్నేహితుడు మాత్రమే.

– హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే

*నువ్వు చేసిన తప్పులను నీ ముఖం మీద చెప్పి సరిచేసేవాడే నిజమైన స్నేహితుడు

– హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే

*నేస్తమా అని పలకరించే హృదయం నీకుంటే.. నీ నేస్తానికి చిరకాలం నేను తోడుంటా..

– హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే

* పేద, ధనిక చూడనిది.. కుల, మత భేదం లేనిది.. బంధుత్వం కన్నా గొప్పది స్నేహం ఒక్కటే.

– హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే

*మీరు గాయపడితే సానుభూతి తెలిపేవారు చాలామంది ఉంటారు. కానీ, ఒక్క ఫ్రెండ్ మాత్రమే.. ఆ గాయాన్ని మరిచిపోయేలా చేస్తాడు!!

– స్నేహితుల రోజు శుభాకాంక్షలు

*మిత్రమా.. నీ బాధలన్నీ తీరుస్తానని నేను హామీ ఇవ్వలేను. కానీ, ఆ బాధల్లోనూ నేను నీకు నిరంతరం తోడుగా ఉంటానని మాత్రం హామీ ఇవ్వగలను.

– స్నేహితుల రోజు శుభాకాంక్షలు

About The Author