లీలామహల్ నుండి ఆక్రమణలు తొలగించండి కమిషనర్ గిరీషా
చిత్తూరు జిల్లా: తిరుపతి,లీలామహల్ కూడలి నుండి కరకంబాడీ మార్గంలో గల ఆక్రమణలను వెంటనే తొలగించాలని నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా అధికారులను ఆదేశించారు.
శనివారం ఉదయం లీలామహల్ కూడలి నుండి కరకంబాడీ మార్గంలో గరుడవారధి వెంబడి ఏర్పాటు చేయనున్న డ్రైనేజి, రోడ్డు ఏర్పాటు కోసం చేసిన మార్కింగ్ ను పరిశీలించారు. మార్కింగ్ చేసిన మేరకు రెండు రోజుల్లో ఆక్రమణలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. తమ అదికారులు మార్కింగ్ చేసిన మేరకు భవన, దుకాణ యజమానులుస్వచ్ఛంధంగాతొలగించుకోవాలన్నారు.
టౌన్ ప్లానింగ్ అధికారులు, సెక్రెటరీలు అందరూ సమన్వయ పరుచుకుని తొలగింపు పనులు చేయాలన్నారు. గరుడ వారధి పొడవునా డ్రైనేజి కాలువ, నాలుగు అడుగుల మేర ఫుట్ పాత్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే శ్రీనివాసం వద్ద జరుగుతున్న డ్రైనేజీ పనులను పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట మునిసిపల్ ఇంజినీర్ చంద్రశేఖర్, ఏ.సి.పి.2 షణ్ముగం, డి.ఈ. కరుణాకర్ రెడ్డి, సర్వేయర్లు దేవానంద్, మురళీకృష్ణ, అప్కాన్స్ ప్రతినిధి స్వామి, తదితరులు పాల్గొన్నారు.