ప్రయాణికులు అలర్ట్ :నేటి నుంచి పలు రైళ్లు రద్దు
గుడివాడ టౌన్: ఉప్పులూరు-విజయవాడ రైల్వే డబ్లింగ్ పనులు చివరిదశకు చేరుకోవడంతో ఆ మార్గంలో ఫ్రీఎన్‌ఐ, మెయిన్ ఎన్ఐ పనులు జరుగుతున్న దృష్ట్యా ఈనెల 7 నుంచి 14వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు చేస్తున్నట్లు స్టేషన్ మే నేజర్ పొట్లూరి మోహన్‌గాంధీ శుక్రవారం తెలిపారు. ఈనెల 13, 14 తేదీల్లో మచిలీపట్నం-బీదర్, బీదర్-మచిలీపట్నం, నర్సాపూర్-ధర్మవరం, ధర్మవరం-నర్సాపూర్, 12, 13 తేదీల్లో కాకినాడ-లింగంపల్లి, లింగంపల్లి-కాకినాడ రైళ్లు రద్దు అవుతాయి.
అదే తేదీల్లో సర్కార్ ఎక్స్‌ప్రెస్ తెనాలి వర కు, నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి-నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లు విజయవాడ వరకు నడుస్తాయన్నారు
తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్ 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు, శేషాద్రి ఎక్స్‌ప్రెస్, ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌లు 13, 14 తేదీల్లో ఏలూరు, నిడదవోలు మీదుగా దారి మళ్లింపు జరుగుతుందని, మచిలీపట్నం-విజయవాడ, నర్సాపూర్-గుంటూరు పాసింజర్ రైళ్లు పూర్తిగా రద్దవుతాయని ఆయన తెలిపారు