టీటీడీ చైర్మన్ గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి నియామకం

టీటీడీ చైర్మన్ గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి నియామకం అయ్యారు. వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి రెండేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. త్వరలో టీటీడీ బోర్డు సభ్యుల నియామకం జరుగనుంది.

టీటీడీ చైర్మన్ పదవి రెండోసారి తనకు కావాలని వైవీ సుబ్బారెడ్డి సీఎం జగన్ ను కోరారు. ఆయన కోరిక మేరకు టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని నియమించారు. అయితే సభ్యులకు సంబంధించి వినతులపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయనుంది.

కారోనా నేపథ్యంలో భక్తుల ఎడల వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు చూసుకోవాల్సిన అవసరముంది.

About The Author