నిమ్మనపల్లి1500 లీటర్ల సారా ఊట ధ్వంసం: ఎస్ఐ ఫాతిమా

నిమ్మనపల్లి :మండల పరిధిలోని ముష్టూరు పంచాయతీ పారేసువారిపల్లి అటవీ ప్రాంతంలో నాటుసారాను యథేచ్ఛగా తయారు చేస్తున్నట్లు ఎస్సై ఫాతిమాకు సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి శుక్రవారం ఉదయం నాటు సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ  మాట్లాడుతూ శుక్రవారం ఉదయం జరిపిన దాడుల్లో పదిహేను వందల లీటర్ల సారా ఊటను ధ్వంసం చేసి, సారా తయారీకి ఉపయోగించే 5 డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మండలంలోని నాటు సారా తయారీ స్థావరాలపై, సారా విక్రయదారుల పై ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలిపారు. ఈ దాడులలో ఎస్ఐ ఫాతిమా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

About The Author