సైబర్ నేర పరిసోధనపై వెబ్ సెమినార్

తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్…

రోజు రోజుకి టెక్నాలజీతో పాటు సైబర్ నేరాలు కూడా పెరిగిపోతూ ఉంది. వీటిని అరికట్టాలంటే ముందుగా సైబర్ నేరమంటే తెలియాలి. దీనిని దృష్టిలో ఉంచుకొని జిల్లా యస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్ గారు జిల్లా పోలీస్ అధికారులకు సిబ్బందికి సైబర్ నేరాలపై అవగాహన మరియు నైపుణ్యం కొరకు ఈ రోజు తిరుపతి పి.టి.సి కళ్యాణి డ్యాం నందు శిక్షణ తరగతులను ప్రారంభించారు.

*జిల్లా యస్.పి:

    *పోలీసుల్లో నైపుణ్యం లేకపోతే ఏమి సాదించలేరు.*

    *మనకు తెలియనవి చాలా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టెక్నాలజీ పరమైన విషయాలను తెలుసుకోవడం చాలా అవసరం.*

    *ప్రతి సిబ్బంది టెక్నాలజీ గురించి తెలుసుకోవాలి. నైపుణ్యతను మెరుగుపరచుకోవాలి.*

    *ఎప్పటికప్పుడు టెక్నాలజీ గురించి తెలుసుకోవాలి.*

    *మారుతున్న కాలంతోపాటు మనం కూడా ముందుకు సాగాలి.*

    *సైబర్ క్రైమ్ లో ఉన్న సిబ్బందే కాదు. లా&ఆ లో ఉన్న సిబ్బంది కూడా సైబర్ నేరాల గురించి తెలుసుకుకోవాలి.*    

దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. రోజుకో విదంగా సైబర్ నెరగాళ్లు కొత్త కొత్త విదానాలతో సాంకేతికంగా నేరాలకు పాల్పడుతున్నారు. వీటిని అరికట్టాలంటే సైబర్ నేరగాళ్ల కంటే ముందు పోలీస్ వారు నేరాలపై అవగాహన కలిగి ఉండాలి. ఈ నేపధ్యంలో సైబర్ నేరానికి సంబంధించిన విషయాలు, ఆర్థిక మోసాలు, నేరం ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేసారు అనే వాటిపై పోలీస్ అధికారులకు, సిబ్బందికి నేరాలను ఎలా విచ్చిన్నం చేయాలి, వాటి మూలం వరకు ఎలా చేరుకోవాలి అనే అంశాలపై పాటిబండ్ల ప్రసాద్ గారు మరియు వారి సిబ్బందిచే సాంకేతిక పరమైన అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది. సైబర్ నేరాలను అదుపులో వుంచి ప్రజలు మోసపోకుండా చూడాలన్నా, సైబర్ కేసులను త్వరగా పరిష్కరించాలన్నా, పోలీస్ వారే చేయాలి. ఇది చేయాలంటే ఇందులో నైపుణ్యత, మెళకువలు చాల అవసరం. సైబర్ క్రైమ్ లో పని చేస్తున్న సిబ్బందే కాదు. లా&ఆ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కూడా సైబర్ నేరాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం.సైబర్ క్రైమ్ వేరు, సైబర్ రిలేటెడ్ క్రైమ్ వేరు. విచారణ చేయు అధికారి (ఐ.ఓ) ముందుగా ఫిర్యాదు దారుడు ఇచ్చిన ఫిర్యాదు నిజమా కాదా తెలుసుకోవాలి. ఫిర్యాదును పూర్తిగా అవగాహన చేసుకోవాలి. నేరము ఎవరు ఎక్కడ నుండి చేసారు దానిని చేదించడం ఎలా? వాటి గురించి ఎలా తెలుసుకోవడం అనే అంశాల మీద విచారణ అధికారికి తెలిసి ఉండాలి. కొన్ని కేసులు చాలా క్లిష్టంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో టెక్నాలజీ మాత్రమే కేసును చేధించడానికి ఉపయోగపడుతుంది. 

ప్రజలు సైబర్ నేరాల భారిన పడకుండా విస్తృతంగా అవగాహన తీసుకురావాలలి. అదే సమయంలో నైపుణ్యతను పెంచుకుని సైబర్ నేరాలను ఛేదించాలి. సైబర్ నేరాలపై అవగాహన మరియు ఛేదింపునకు అవసరమయ్యే మెళకువలు, ముందు జాగ్రత్తలు గురించి ఈ కార్యక్రమంలో జిల్లా యస్.పి గారు వివరించారు. ఈ శిక్షణా తరగతులకు అడ్మిన్ అడిషనల్ యస్.పి శ్రీమతి ఐ.సుప్రజ మేడం గారు, దిశా డి.యస్.పి రామరాజు,  యస్.హెచ్.ఓ లు (ఐ.ఓ లు) ఈస్ట్ శివప్రసాద్ రెడ్డి, వెస్ట్ శివప్రసాద్, తిరుమల II టౌన్ చంద్రశేఖర్, సైబర్ క్రైమ్ సి.ఐ సుబ్రమణ్యం రెడ్డి, తిరుచానూరు సిధాకర్ రెడ్డి, యస్.ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.

About The Author