టీటీడీ చరిత్రలో మరో అపూర్వ ఘట్టం చోటుచేసుకోబోతుంది.


*టీటీడీ చరిత్రలో మరో అపూర్వ ఘట్టం చోటుచేసుకోబోతుంది. ఈ నెల 30వ తేదీన శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన శ్రీవారికి నవనీత సేవ పేరుతో మరో సరికొత్త సేవకు టీటీడీ శ్రీకారం చుట్టబోతుంది.*

*టీటీడీ పాలకమండలి ఛైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో గత పాలకమండలి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా, ఈఓ డా. కె ఎస్. జవహర్ రెడ్డి, అడిషనల్ ఈఓ శ్రీ ఏవీ ధర్మారెడ్డి గారి ఆదేశాల మేరకు టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు, గోవిందుని గోపధకం కమిటీ సభ్యులు శ్రీ కె శివ కుమార్ టీటీడీ శాఖాధిపతులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు.*

*ఈ సమావేశంలో ఈనెల 30వ తేదీన ప్రారంభమయ్యే నవనీత సేవకు సంబంధించిన పలు విషయాలను చర్చించి, సమగ్ర కార్యాచరణను రూపొందించడం జరిగింది.*

*నవనీతం తయారుచేయబోయే గోశాలను పూర్తిగా గోమయంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం, వేణువుతో సంగీతం, మహిళా మణులతో వెన్న చిలకడం, శ్రీవారికి సమర్పించబోయే నవనీతాన్ని భక్తి ప్రపత్తులతో, సాంప్రదాయ బద్దంగా తిరుమాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్ళి స్వామివారికి నివేదించాలని నిర్ణయించడం జరిగింది. సామాన్య భక్తులు కూడా పాల్గొనే అవకాశం వున్న ఈ సేవను ఈనెల 20 నుండి 25వ తేదీల మధ్య పరిశీలనాత్మకంగా ప్రారంభించనున్నారు.*

*ఈ సమావేశంలో గోవిందుని గోపథకం కమిటీ సభ్యులు శ్రీ శివరామ్, శ్రీ విజయ కుమార్ శర్మ, శ్రీ పద్మాకర్, శ్రీ శివ సాగర్ రెడ్డి, డిప్యూటీ ఈవో శ్రీ కె హరేంద్రనాధ్, ఎస్ వి గో సంరక్షణ శాల డైరెక్టర్ డా.కె హరినాథ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ గో పుష్టి సంఘం సలహాదారులు శ్రీ రవి కుమార్, శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ వెంకట నాయుడు, డా. డి నాగరాజు, వాటర్ వర్క్స్ ఈ ఈ శ్రీ శ్రీహరి, ఈ ఈ 1 శ్రీ జగన్ మోహన్ రెడ్డి, ఎలక్ట్రికల్ డి ఈ 1 శ్రీ రవిశంకర్ రెడ్డి, శ్రీ వంశీ తదితరులు పాల్గొన్నారు.*

About The Author