స్వదర్మంలోకి తిరిగి వచ్చిన కేరళ నటి లక్ష్మి ప్రియా..
స్వదర్మంలోకి తిరిగి వచ్చిన కేరళ నటి లక్ష్మి ప్రియా.. (పాత పేరు సబీనా అబ్దుల్ లతీఫ్)
కేరళలోని అలప్పుజలో ముస్లిం తల్లిదండ్రులకు సబీనా అబ్దుల్ లతీఫ్ గా జన్మించిన నటి లక్ష్మీ ప్రియ తన పేరును మార్చి తాజా గెజిట్‌లో ప్రచురించింది, ఆమె హిందూ ధర్మంలోకి ఘర్ వాపసి అవుతున్నట్టు అధికారికంగా తెలియజేసింది..
ఆమె తన సోషల్ మీడియా పేజీలలో గెజెట్ ప్రతిని అప్‌లోడ్ చేసి అదే విషయాన్ని ప్రకటించింది..
ఆమె విమర్శకులకు (ఇస్లామిస్టులు/కమ్యూనిస్టులు) ‘ధన్యవాదాలు’ చెప్పింది. ప్రస్తుతం ఆమెకు ఫేస్‌బుక్‌లో 7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు..
మతం పేరు చెప్పి రాళ్ళు రువ్వడం, హిందువుల మీద దాడులు, హత్యలు చేయడం చూడలేకే తను స్వధర్మం లోకి వచ్చిన్నట్టు పేర్కొంది..
ఆమె 2005 లో సంగీతకారుడు పట్టనక్కాడ్ పురుషోత్తమన్ కుమారుడు పి.జయేష్‌ను వివాహం చేసుకుంది..
వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమెకు మాతంగి జై అనే కుమార్తె ఉంది. జయేశ్ తన జీవితంలోకి వచ్చిన తర్వాతనే ఇప్పుడు వారు చూస్తున్న స్వేచ్ఛా మరియు శక్తివంతమైన మహిళగా ఉంటున్నానని లక్ష్మీ ప్రియ అంగీకరించింది..
హిందు ధర్మంలోకి వచ్చిన తరువాతే స్వేచ్ఛ అంటే ఎంటో తెలిసిందని ఆమె పేర్కొన్నారు..
మలయాళ చిత్ర పరిశ్రమపై జిహాదీలకు ఉన్న గట్టి పట్టు స్పష్టంగా కనబడింది. ఆమె అర్హత ఉన్న పాత్రలను కోల్పోవడం ప్రారంభించింది. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నది.
సోషల్ మీడియాలో వేదింపులు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. చంపేస్తాం అంటూ ఇస్లామిస్టులు ఆమెను బెదిరిస్తూనే ఉన్నారు..