కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య…జనసేన @9Staar Tv


రాజమండ్రిలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభ పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ సందర్భంగా రైతులు, యువత, మహిళలపై పవన్ వరాల జల్లు కురిపించారు. రైతు కన్నీరు దేశానికి మంచిది కాదన్న ఆయన.. 60 ఏళ్లు పైబడిన సన్న చిన్నకారు రైతులు, కౌలు రైతులకు నెలకు రూ.5 వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. మరో రెండు రోజుల్లో జనసేన మేనిఫెస్టో పూర్తి ప్రతిని విడుదల చేస్తామని పవన్ తెలిపారు. ఏళ్ల తరబడి ఆలోచించి మేనిఫెస్టోకు రూపకల్పన చేశామని ఆయన చెప్పారు.
* రైతులకు ఎకరానికి రూ.8 వేల చొప్పున సాగు సాయం అందిస్తాం. మిగులు బడ్జెట్ ఉంటే దాన్ని రూ. పదివేలకు పెంపు.
* రక్షణ భరోసా పథకం కింద.. 60 ఏళ్ల పైబడిన రైతులు, కౌలు రౌతులకు నెలకు రూ.5 వేల పెన్షన్. ప్రాజెక్టుల కోసం భూమిని కోల్పోయి వారికి 2013 భూసేకరణ చట్టం కింద న్యాయం.
* భూములను కోల్పోయిన రైతులను పారిశ్రామికీకరణలో భాగం చేస్తాం.
* రూ.5 వేల కోట్ల పెట్టుబడితో ఉభయ గోదావరి జిల్లాల్లో గ్లోబల్ మార్కెట్ ఏర్పాటు చేస్తాం. ఆహార ధాన్యాలు, పండ్ల ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా మార్కెంటింగ్ చేసుకోవడానికి, ప్రతి జిల్లాలోని అన్ని మండలాల్లో శీతల గిడ్డంగుల ఏర్పాటు.
* రైతులకు ఉచితంగా సోలార్ మోటార్లు ఇస్తాం.
* ప్రతి జిల్లాలో, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో నదులు అనుసంధానిస్తానం. రిజర్వాయర్లను నిర్మిస్తాం.
* ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తాం. ఉచిత రవాణ సదుపాయం కల్పిస్తాం. విద్యార్థులకు డొక్కా సీతమ్మ పేరిట క్యాంటీన్లను ఏర్పాటు చేసిన నాణ్యమైన ఉచిత భోజనం పెడతాం.
* ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఏర్పాటు.
* కుల మతాలకు అతీతంగా.. విద్యార్థుల కోసం కామన్ హాస్టల్స్ ఏర్పాటు చేస్తాం.
* విద్యార్థుల తెలివితేటలను బయటకు తీయడానికి ఇంక్యుబేషన్ సెంటర్లు, ఇన్నోవేషన్ హబ్‌లను ఏర్పాటు చేస్తాం.
* ప్రభుత్వం ఏర్పాటైతే.. ఆరు నెలల్లోనే దాదాపు లక్ష బ్యాక్ లాగ్ ఉద్యోగాలు కల్పిస్తాం.
* ఏటా పది లక్షల ఉద్యోగాలు సృష్టించే వ్యవస్థను రూపొందిస్తాం.
* ఆరోగ్యానికి బడ్జెట్‌ కేటాయింపులు రెట్టింపు. ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల ఆరోగ్య బీమా పథకం.
* దశల వారీగా పీహెచ్‌సీలను 30 పడకల ఆసుపత్రులుగా మార్పు. ప్రతి మండలంలో మొబైల్ డయాగ్నోస్టిక్ సెంటర్ల ఏర్పాటు.
* చిరు వ్యాపారులకు, తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకునేవారికి పావలా వడ్డీతో రుణ సదుపాయం. ఎవరూ వేధించకుండా బాధ్యత తీసుకుంటాం.
* బంగారం తాకట్టుపై 50 పైసల వడ్డీకే రుణం. ఏడాదిలోగా చెల్లిస్తే పావలా వడ్డీ
* మత్స్యకారులకు 365 రోజులు ఉపాధి. వేటకు వెళ్లలేని సమయంలో రోజుకు రూ.500. రెండేళ్లలోగా సురక్షిత తాగునీరు.
* మత్స్యకారులకు ప్రత్యేక జెట్టీలు ఏర్పాటు. సముద్రం లోపల వేటకోసం ప్రత్యేకంగా పెద్ద మరపడవలు అందజేత.
* ఆడపడుచుల భద్రత కోసం కఠిన చట్టాలు తీసుకొస్తాం. 33 శాతం రిజర్వేషన్ల కోసం కృషి.
* డ్వాక్రా, స్వయం ఉపాధి సంఘాల ఆడపడుచులకు స్థానిక సంఘాల ఎన్నికల్లో ప్రాధాన్యం.
* ప్రతి సంకాంత్రికి ఆడపడుచులకు చీరలు, బహుమతులు. ఇతర మతస్థులకు కూడా వారి పండుగలకు కూడా అందజేత.
* ఉచిత గ్యాసు కనెక్షన్లు.
* మహిళల కోసం ప్రతి జిల్లాకు ఆరోగ్య సూపర్ స్పాషాలిటీ ఏర్పాటు. ప్రతి మండలానికి కళ్యాణ మండపం.
* చిన్న పిల్లలున్న ఉద్యోగినుల కోసం చైల్డ్ కేర్ సెంటర్ల ఏర్పాటు.
* ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తాం. తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం.
* బీసీలకు రాజకీయాల్లో ఐదు శాతం రిజర్వేషన్
* కాపులకు 9వ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్లు
* ఎస్సీ వర్గీకరణ కోసం ఇరువర్గాలతో చర్చలు జరిపి పరిష్కారం కోసం కృషి
* రెల్లి యువతకు రూ.50 వేల వరకు వడ్డీ లేని రుణాలు
* రెల్లి కార్మికులకు 50 శాతం సబ్సిడీతో ఆటోలు కొనుగోలు చేసే సదుపాయం
* ప్రైవేట్ ఉద్యోగాలు చేసే రెల్లి మహిళలకు ఉచితంగా స్కూటర్ల పంపిణీ
* యువ పారిశ్రామిక వేత్తల కోసం ఆపర్చునిటీ జోన్ల ఏర్పాటు
* మూడు మండలాలకు ఒకటి చొప్పున 130 స్మార్ట్ సిటీల ఏర్పాటు. వీటి వల్ల 50 వేల ఉద్యోగాలు లభిస్తాయి.

About The Author