శివబాలాజీ, సమీర్‌ మధ్య తీవ్ర ఘర్షణ


పోలింగ్ ప్రారంభమైన ఒక గంట మాత్రమే ప్రశాంతంగా సాగిన ఎన్నికలు.. ఆ తర్వాత పూర్తిగా గందరగోళంగా మారిపోయాయి. ఇరు ప్యానళ్ల సభ్యులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. పోలింగ్‌ కేంద్రం లోపల ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ ప్రచారం చేస్తున్నారంటూ.. మంచు మోహన్‌బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు శివబాలాజీ చేయిని హేమ కొరకడం గమనార్హం.

సమీర్, శివబాలాజీ ఘర్షణ

పోలింగ్‌ కేంద్రం వద్ద సమీర్, శివబాలాజీ సైతం ఘర్షణకు దిగారు. సమీర్ పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నాడు అంటూ శివబాలాజీ ఆరోపించాడు. సమీర్ సైతం అతనిపై విరుచుకుపడ్డాడు. ఇద్దరికీ ఇరు వర్గాల సభ్యులు సర్ది చెప్పారు.

నేను ఓటు వేసిన వాళ్లే గెలుస్తారు : బండ్ల గణేష్

బండ్ల గణేష్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు బండ్ల గణేష్ తనదైన శైలిలో మాట్లాడుతూ ఎక్కడ మర్డర్లు, మానభంగాలు జరడం లేదు.. ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. కచ్చితంగా ఎవరో ఒకరు గెలుస్తారు.. రాసిపెట్టుకోండి. 26మంది గెలుస్తారు. అందులో ఒకరు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కూడా గెలుస్తారు. నేను ఓటు వేసిన వాళ్లే గెలుస్తారు అంటూ బండ్ల గణేష్ కామెంట్ చేశాడు.
బండ్ల గణేష్ పరోక్షంగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ గురించి చెప్పాడా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్‌కే బండ్లన్న ఓటు వేసి ఉంటారని అనుకుంటున్నారు.

పోలింగ్ సమయం ఉదయం 8 గంటల నుంచి మద్యాహ్నం 2 గంటల వరకు నిర్ణయించగా, పోలింగ్ బూత్ వద్ద ఉన్న రద్దీకారణంగా ఇంకా మరికొంతమంది ఓటు హక్కును నిర్ణీత సమయంలో వినియోగించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో మరో గంటపాటు పోలింగ్ సమయాన్ని పొడింగించినట్టు మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మంచు విష్ణు ట్వీట్ ద్వారా తెలిపాడు.

About The Author