డిసెంబర్ 26,27 జరుగు ఏఐటీయూసీ జిల్లా మహాసభలు జయప్రదం చేయండి.


డిసెంబర్ 26,27 జరుగు ఏఐటీయూసీ జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని స్థానిక రైల్వే స్టేషన్ వద్ద మహాసభల కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్యాక్సీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపీ బాల పాల్గొన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రీన్ టాక్స్ ఐదు సంవత్సరాలకు ఒకసారి 600 రూపాయలు ఉన్నదాన్ని ఒకేసారి ఆరు వేల రూపాయలకు పెంచడాన్ని టాక్సీ వర్కర్స్ యూనియన్ గా మేము వ్యతిరేకిస్తున్నామన్నారు. అదేవిధంగా రోడ్డు టాక్స్, లైఫ్ టాక్స్ 12000 ఉన్నదాన్ని 24000 వేళారూపాయాలి చేయడం దారుణమని అన్నారు. టోల్ ప్లాజా దగ్గర ఫాస్ట్ ట్రాక్ లో డబ్బులు లేక పోతే డబుల్ ఛార్జి వసూలు చేయడం మానుకోవాలన్నారు. ఏఐటియుసి నగర ప్రధాన కార్యదర్శి ఎం డి రవి మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కారం లేని పక్షంలో ఏఐటీయూసీ ఎర్రజెండా ఆధ్వర్యంలో డిసెంబర్ 26,27 తేదీలలో జరుగు ఏఐటియుసి 15వ జిల్లా మహాసభలలో పై సమస్యలపై చర్చించి పోరాటాలకు రూపకల్పన చేస్తామని తెలిపారు. ఈ మహాసభలలో జిల్లాలో ఉన్న టాక్సీ వర్కర్లు అందరు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏ ఐ టి యు సి జిల్లా సహాయ కార్యదర్శి సిహెచ్ శివ కుమార్, టాక్సీ వర్కర్స్ యూనియన్ నాయకులు రైల్వే బాల, యల్ .కె. నాయుడు , రమేష్ ,గణేష్, సాయికుమార్, మోహన,పూర్ణ, సురేష్, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఏపీ. బాలా ,
జిల్లా ప్రధాన కార్యదర్శి,
టాక్సీ వర్కర్స్ యూనియన్ (AITUC ).