పాకిస్థాన్ లోని ప్రధాన నగరాలైన వాటిలో నాలుగు నగరాలను…
పాకిస్థాన్ లోని ప్రధాన నగరాలైన వాటిలో నాలుగు నగరాలను శ్రీరాముని తనయులైన లవ,కుశలు….భరతుని కుమారులైన తక్షుడు, పుష్కరుడు కట్టించారట. అప్పట్లో ఈ నగరాలు పేర్లు కూడా కట్టించిన వారి పేరు మీదుగానే ఉండేవట, కాలక్రమేణా….వాటి పేర్లలో మార్పులు సంభవించాయట, మార్పులొచ్చినప్పటికీ వాటి పేర్లు ఒరిజినల్ పేర్లకు దగ్గరగా ఉండడం విశేషం.
1. ఖాసూర్
దీని అసలు పేరు కుశపురం….దీనిని శ్రీరాముడి పెద్ద కుమారుడు కుశుడు కట్టిచాడు, అతని పేరు మీదుగానే ఈ నగరానికి కుశపురం వచ్చింది, తర్వాతర్వాత….కుశపురం కాస్త…ఖాసూర్ గా రూపాంతరం చెందింది.
2. లాహోర్
దీని అసలు పేరు లవపురం….దీనిని శ్రీరాముడి చిన్న కుమారుడు లవుడు కట్టిచాడు, అతని పేరు మీదుగానే ఈ నగరానికి లవపురం వచ్చింది, తర్వాతర్వాత….లవపురం కాస్త…లాహోర్ గా రూపాంతరం చెందింది.
౩. తక్షశిల
దీనిని శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించాడు.
4. పెషావర్
దీని అసలు పేరు పుష్కలావతి / పురుషపురం…దీనిని శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ
కొడుకు పుష్కరుడు నిర్మించాడు. కాలక్రమేణా పురుషపురం కాస్త పెషావర్ గా మారిపోయింది.