లక్ష్మణ ఫలం… ఔషధ గుణాలు…
లక్ష్మణ ఫలం..ఔషధ గుణాలు…
లక్ష్మణ ఫలంలో 12 రకాల కేన్సర్ కారక కణాలను నిర్మూలించే ఔషధగుణాలు ఉన్నట్లు పరిశోధకులు తెలుసుకున్నారు. పెద్ద ప్రేగు కేన్సర్, రొమ్ము కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్, శ్వాసకోస కేన్సర్, క్లోమ గ్రంధి కేన్సర్ వంటి మరణాంతక కేన్సర్ చికిత్స ఈ వృక్షంలోని ఔషధ గుణాల వల్ల సంభవమని తెలుసుకున్నారు. పెద్ద ప్రేగు కేన్సర్ చికిత్సలో వినియోగించే ఖీమో ధెరఫీ కన్నా 10,000 రెట్లు అధికంగా ఈ చెట్టులోని ఔషధ గుణాలు కేన్సర్ కణాలను నిర్మూలించగలవని తెలుసుకున్నారు. ఈ వృక్షభాగంలో ఔషధ గుణాల గురించి దాదాపు 22 పరిశొధనలు జరిగాయి. కేన్సర్ వ్యాధినుండి గ్రావియోలా వృక్షంలోని ఔషధ తత్వాలు రక్షించడమే కాక శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అమెరికాలోని కొందరు వైద్యులు, కేన్సర్ వ్యాధి గ్రస్తులు ప్రస్తుతం ఈ చెట్టు సారంతో ఉత్పత్తి చేసిన ఔషధాలనే వాడుతున్నారు. అమెరికాలోని అమెజాన్ అడవుల్లో నివసించే ఆటవికులు వందల సంవత్సరాలుగా ఈ చెట్టు బెరడును, ఆకులను, వ్రేళ్ళను, పూలతో సహా విత్తనాలను సైతం వివిధ వ్యాధుల చికిత్సకు వినియోగిస్తున్నారు. తమిళనాడు దిందిగుల్ జిల్లాలో కొన్ని తెగలు చర్మవాధికి ఒక నెల వరకూ లక్ష్మణ ఫల ఆకులను స్త్రీ మూత్రంతో ముద్దగా చేసి చర్మానికి పూసుకుంటారు. కడుపులో పురుగులను హరించుటలోను, జ్వరాలు తగ్గించుటలోను, తల్లిపాలుపెరుగుటకు, జిగట విరేచనాలకు లక్ష్మణ ఫలాల జ్యూస్ ఉపయోగపడుతుంది. తలలో పేలకు గింజల చూర్ణం ఉపయోగపడుతుంది. నిద్రలేమికి, కండరాల సమస్యలకు, అల్ప రక్తపోటు కు వీటి చెట్టు బెరడు, ఆకులు ఉపయోగపడతాయి. అమెరికాలో లక్ష్మణ ఫలాల గుజ్జును ఐస్ క్రీములు, పానీయాలు, స్వీట్లు మొదలగువాటిలో వాడతారు.
కేన్సర్ కు వాడే విధానం
కేన్సర్ ఉన్నవారు లక్ష్మణ ఫలం చెట్టు ఆకులను నీడలో పూర్తిగా ఆరబెట్టి కత్తెరతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని గాజు సీసాలో దాచుకొని ప్రతి రోజు 5 గ్రాములు 200 మిల్లీ లీటర్ల నీటిలో వేసి మరిగించి ఒక గ్లాసు అయిన తర్వాత దించి వడబోసుకొని త్రాగాలి. దీనిని ఎప్పటికప్పుడు తయారుచేసుకోవాలి. రోజుకు కనీసం 2 లేక 3 సార్లు త్రాగాలి
పోషక విలువలు
100 గ్రాముల లక్ష్మణ ఫలంలో తేమ 82.8 గ్రా, ప్రోటీన్1.0 గ్రా, ప్యాట్ 0.97 గ్రా, కార్బో హైడ్రేట్ 14.63 గ్రా, ఫైబర్ 0.79 గ్రా, యాష్ 60 గ్రా, కేల్షియం 10.3 మి.గ్రా, ఫాస్పరస్ 27.7 మి.గ్రా, ఐరన్ 0.64 మి.గ్రా, విటమిన్ ఎ 0, థయామిన్ 0.11 మి.గ్రా, రైబోఫ్లోవిన్ 0.05 మి.గ్రా, నియాసిన్ 1.28 మి.గ్రా, ఆస్కార్బిక్ యాసిడ్ 29.6 మి.గ్రా, ట్రిప్టోపాన్ 11 మి.గ్రా, మెథియోనైన్ 7 మి.గ్రా, లైసిన్ 60 గ్రా ఉంటాయి