కోవిడ్ నిర్ధారణ పరీక్షలకు అధిక మొత్తం వసూలు చేస్తున్న ల్యాబ్ లపై మెరుపు దాడులు.


నగరంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలకు ప్రభుత్వం నిర్దేశించిన 350 రూపాయలకంటే అధికమొత్తాన్ని వసూలు చేస్తున్న 3 ల్యాబ్ లపై వైద్య ఆరోగ్య శాఖాధికారులు కొరఢా ఝులిపించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ జె. నివాస్ , జేసీ (అభివృద్ధి) ఎల్. శివశంకర్ ల ఆదేశాల మేరకు నగరం లోని పలు ల్యాబ్ లపై మెరుపు దాడులు చేసారు. ఈ దాడులలో డి ఎం. అండ్ హెచ్ ఓ డా. ఎం. సుహాసిని స్వయంగా పాల్గొన్నారు. తొలుత 7 మంది డిప్యూటీ డి ఎం. హెచ్ ఓ ల స్థాయి వైద్యులతో 7 బృందాలు ఏర్పడ్డాయి. ఆ బృందాలలో రెవిన్యూ అధికారులు కూడా ఉన్నారు. కామినేని హాస్పిటల్, అపోలో లాబోరేటరీ , రెమెడీస్ లాబోరేటరీ , ఏ బి సి డయాగ్నొస్టిక్ సెంటర్, ఐరిష్ లాబోరేటరీ , ఓమైక్రాన్ డయాగ్నొస్టిక్ సెంటర్, సాయి బాలాజీ డయాగ్నొస్టిక్ సెంటర్ వంటి 7 కోవిడ్ ఓమిక్రాన్ పరీక్షలు చేస్టున్న లాబోరేటరీ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా నిర్దారించాలంటే ఆర్ టి సి పి ఆర్ పరీక్ష చేయాలి. కరోనా వేరియంట్ ఓమిక్రాన్ విస్తృతమవుతున్నందువల్ల కోవిడ్ నిర్ధారణకు ఆర్ టి సి పి ఆర్ పరీక్షకు 350 రూపాయలు వసూలు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ. 28 విడుదల చేసింది. కోవిడ్ నిర్ధారణ పరీక్షకు ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం కంటే అదనంగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో జిల్లా యంత్రంగం నియమించిన బృందాలు శుక్రవారం పలు ల్యాబ్ లపై దాడుల చేసాయి. ఆ మేరకు జరిపిన తనిఖీలలో ఓమైక్రాన్ లాబరేటరీ నిర్దేశించిన మొత్తం 350 రూపాయలు కాగా అదనంగా 149 రూపాయలు చొప్పున 499 రూపాయలు వసూలు చేస్తోంది. అలాగే సాయి బాలాజీ లాబోరేటరీ , కామినేని హాస్పిటల్ కూడా నిర్దేశించిన రుసుము కంటే అదనంగా 149 రూపాయలు చేస్తున్నారు. ఈ విధంగా ఈ మూడు ల్యాబ్ లు 471 మంది నుండి వసూలు చేసిన అదనపు సొమ్ము సుమారు 80 వేల రూపాయలను తిరిగి వారికి చెల్లించి, నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసారు. తొలిసారిగా చేసిన తప్పుగా భవిస్తూ అదనంగా తీసుకున్న మొత్తం వారికీ తిరిగి చెల్లించాలని ఆదేశిస్తున్నామని, మళ్ళీ ఇదే తప్పు పురావృతం అయితే హాస్పిటల్, క్లినికల్ ఆక్ట్ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య శాఖాధికారి డా. ఎం. సుహాసిని ల్యాబ్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేసారు. అలాగే అపోలో లాబోరేటరీ సాధారణ లాబోరేటరీ లైసెన్స్ కలిగి ఉండి , హై అండ్ లాబోరేటరీ నిర్వహిస్తోంది. లాబోరేటరీ నిర్వహణకు గాను 10 వేల రూపాయల రుసుము చెల్లించి అనుమతి తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. ఇదివరకే తీసుకోనందున 20 వేల రూపాయలు జరిమానా విధించారు. డా మోతిబాబు, డా. రవికుమార్, డా. సుధా ప్రసూజా, డా. వేణుగోపాలకృష్ణ, డా. ఇందుమతి, డా. సుమన్, తదితరులు ఈ దాడులలో పాల్గొన్నారు.
———————————————————————————–
(ఉప సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, విజయవాడ వారిచే జారీ చేయబడినది )

About The Author