ఆంద్రప్రదేశ్ కొత్త జిల్లాల వివరాలు…


ఏపీలో త్వరలో కొత్తగా 26 జిల్లాలు ఏర్పాటు కానున్నాయని ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు.

పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు.

13 జిల్లాలను 26 జిల్లాలుగా చేయనున్నామని ఆయన తెలిపారు.

రెండ్రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని ఆయన పేర్కొన్నారు.

*కొత్త జిల్లాల వివరాలు :*

కడప,
కర్నూల్,
నంద్యాల,
అనంతపురం,
హిందూపురం,
చిత్తూరు,
తిరుపతి,
రాజం పేట,
నెల్లూరు,
ఒంగోలు,
బాపట్ల,
నరసరావు పేట,
గుంటూరు,
విజయవాడ,
మచిలీపట్నం,
నరసాపురం,
అమలాపురం,
రాజమండ్రి,
ఏలూరు,
కాకినాడ,
అరకు (రెండు జిల్లాలు),
శ్రీకాకుళం,
విశాఖపట్నం,
విజయనగరం,
అనకాపల్లి గా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

అదేవిధంగా నరసరావుపేట పార్లమెంట్ కేంద్రాన్ని పిడుగురాళ్ల, గురజాలలో పెట్టాలని సీఎంను కోరామని పిన్నెల్లి  తెలిపారు.