ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు బూతు మాటలు..
https://www.youtube.com/watch?v=IjwnJ-mUZBo
ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు బూతు మాటలు.. @9Staar Tv
ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజుకు అవమానం ఎదురైంది. ముఖ్యమంత్రి జగన్ విశాఖ శారదాపీఠానికి వస్తున్న సందర్భంగా శారదాపీఠంలోకి మంత్రి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి ఒక్కరే లోపలకు వెళ్లాలని, అనుచరులను లోపలకు పంపించబోమని ఒక సీఐ స్పష్టం చేశారు. మంత్రి మాట్లాడుతుండగా మీరు ఒక్కరే వెళ్తే వెళ్లండి లేకపోతే లేదు అంటూ ఆయన ముఖం మీదే గేటు వేశారు. షాక్ కు గురైన మంత్రి ఆ కార్యక్రమంలో పాల్గొనకుండానే అక్కడి నుంచి అలిగి వెళ్లిపోయారు.
మంత్రి మాత్రమే లోపలకి వెళ్లాలని అనుచరులు అనుమతించేది లేదని పోలీసులు చెప్పారు. మంత్రి చెప్పిన మాటలను అక్కడి పోలీసులు పట్టించుకోలేదు. దీంతో దురుసుగా గెట్ వేసి లోపలకి వెళ్లాలని, లేకుంటే లేదని సీఐ తేల్చిచెప్పారు. తనకు క్షమాపణలు చెప్పాలని మంత్రి అప్పలరాజు, అనుచరులు డిమాండ్ చేశారు. సీఐ క్షమాపణలు చెప్పక పోవడంతో మంత్రి అప్పలరాజు అలిగి వెనక్కి వెళ్లిపోయారు..