దేశవ్యాప్తంగా 22 రైళ్ల గమ్యస్థానాలు…
దేశవ్యాప్తంగా 22 రైళ్ల గమ్యస్థానాలు
అమరావతి గురించి న్యూఢిల్లీ, జనవరి 23(9స్టార్ టీవీ): దేశవ్యాప్తంగా 22 రైళ్ల గమ్యస్థానాన్ని పొడిగిస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తున్న రైళ్లు కూడా వీటిలో ఉన్నాయి. రైల్వేమంత్రి పియూష్ గోయల్ బుధవారం ఢిల్లీలో ఆ వివరాలను వెల్లడించారు. హౌరా-విజయవాడ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రె్‌సను తిరుపతి వరకు పొడిగించారు. ఒం గోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలోనూ ఈ రైలు ఆగుతుంది. అలాగే, కటక్-బ్రహంపూర్ మెము రైలును ఇచ్చాపురం వరకు, విశాఖపట్టణం-పలాసా ప్యాసింజర్ రైలును బ్రహంపూర్ వరకు, సికింద్రాబాద్-తాండూర్ మెము రైలును చిత్తాపూర్(కర్ణాటక) వరకు పొడిగించారు. అలాగే, మిర్యాలగూడ-కాచిగూడ డెము రైలును నడికుడి వరకు పొడిగించారు. ఈ రైలు కొండ్రపోల్, విష్ణుపురం, పొందుగులలోనూ ఆగుతుంది. ఈ కార్యక్రమంలో రైల్వే బో ర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్, సభ్యుడు గిరిష్ పిళ్లయ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.