ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లకు నియామకం పత్రాలు అందించిన అటవీ శాఖ ఉన్నతాధికారులు…
కొత్తగా ఎంపికైన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లకు నియామకం పత్రాలు అందించిన అటవీ శాఖ ఉన్నతాధికారులు –
TSPSC ద్వారా డైరెక్ట్ రిక్రూట్ మెంట్ లో ఎంపికైన 66 మంది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు. అరణ్య భవన్ లో నియామక పత్రాలు 66 మందిలో 21 మంది మహిళలు. 18 నెలల పాటు శిక్షణకు వెళ్లనున్న ఎఫ్ఆర్వోలు.41 మందికి అస్సాంలో , 25 మందికి కర్ణాటక ధార్వాడ్ లో శిక్షణ. ఫిబ్రవరి రెండో వారంలో మొదలుకానున్న శిక్షణ. ఏ ప్రభుత్వమూ ఇవ్వని ప్రాధాన్యత అడవులకు ప్రస్తుత ప్రభుత్వం ఇస్తోంది, నిబద్ధతతో పనిచేసి రాణించాలి అన్నారు పీసీసీఎఫ్ పీకే ఝా. ఉద్యోగాల్లో నియామకంపై అభ్యర్థుల హర్షం, తెలంగాణ ప్రభుత్వానికి పేరు తెచ్చేలా పనిచేస్తామని వెల్లడి. కార్యక్రమంలో పాల్గొన్న పీసీపీఎఫ్ పీకే ఝా, రఘవీర్, పృధ్వీరాజ్, అదనపు పీసీసీఎఫ్ మునీంద్ర.