తిరుమలలో పెరిగిన రద్దీ.. క్యూ లైన్లలో భక్తుల కోసం టీటీడీ ఏర్పాట్లు, ఛైర్మన్ తనిఖీలు


*తిరుమల శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్‌లో వెళ్లే భక్తులకు ఆహారం, పాలు అందజేయాలని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు*. *తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో ఆయన స్లాట్‌ సర్వదర్శనం క్యూలైన్లను పరిశీలించారు*. *కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పడడంతో క్యూ లైన్లలో ఆహారం, పాలు తిరిగి పునరుద్దణ చేసి భక్తులకు అందజేయాలని సుబ్బారెడ్డి సూచించారు*.

*క్యూలో దర్శనానికి వెళ్తున్న భక్తులతో మాట్లాడారు*.. *ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు*. *స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తున్న సమయంలో సదుపాయాలు సరిగా ఉన్నాయా లేదా అని ఆరా తీశారు*. *క్యూ లైన్ల నిర్వహణ పరిశీలించి.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందని తెలుసుకున్నారు*. *ఉదయం గంటన్నర లోగా*.. *సాయంత్రం 6గంటల తర్వాత రెండు గంటలవుతోందని అధికారులు టీటీడీ ఛైర్మన్‌కు తెలిపారు*.

*క్యూ లైన్లలో భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు*. *తిరుమలలో పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు*. *రాంభగీచా బస్టాండ్‌ సమీపంలోని అన్నప్రసాద వితరణ కౌంటర్‌ను పరిశీలించారు*. *అనంతరం పీఏసీ1కు వెళ్లి అక్కడ ఉన్న భక్తులతో మాట్లాడారు*. *గదులు సులువుగా దొరుకుతున్నాయా*, *దర్శనానికి ఎంత సమయం పట్టిందని తెలుసుకున్నారు*.

*వేసవి ప్రభావంతో ఉష్ణోగ్రత్తలు ఎక్కువుగా నమోదవుతున్న క్రమంలో భక్తులు ఇబ్బంది పడకుండా తాగునీటి సరఫరా జరిగేలా చూసుకోవాలని సూచించారు*. *అలాగే పారిశుధ్య సమస్య రాకుండా శుభ్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఛైర్మన్ ఆదేశించారు*. *స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్ లోకి ప్రవేశించే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా క్యూలైన్ల నిర్వహణ సక్రమంగా చేయాలని విజిలెన్స్ అధికారులను‌ అదేశించారు*.

About The Author