అత్యంత వైభవంగా… దేదీప్యమానంగా… యాదాద్రి – మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవం
అత్యంత వైభవంగా… దేదీప్యమానంగా… యాదాద్రి – మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవం
– నమో నారసింహా.. యాదాద్రీశా గోవిందా.. శ్రీలక్ష్మీ నరసింహస్వామి నామస్మరణ, భక్తుల జయ జయధ్వానాల మధ్య సోమవారం ఉదయం నవ వైకుంఠంగా పునర్నిర్మించిన యాదాద్రిలో మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవం వైభవంగా జరిగింది
– మహాకుంభ సంప్రోక్షణ తొలిపూజలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దంపతులు, కుటుంబ సభ్యులు పాల్గొనగా, ఆలయ ప్రధాన అర్చకులు వారికి ఆశీర్వచనం అందించారు.
– యాదాద్రి అంతటా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. సోమవారం ఉదయమే మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొదలయ్యాయి.
– బాలాలయంలోని శ్రీస్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో నిర్వహించిన శోభాయాత్రలో సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.
– శోభాయాత్రలో భాగంగా బంగారు కవమూర్తులు, ఉత్సవ విగ్రహాలు, అళ్వార్లు ప్రదర్శించడంతో పాటు కళా ప్రదర్శనలు జరిపారు.
– ఈ సందర్భంగా వేద మంత్రోచ్ఛరణలు, మేళ తాళాల మధ్య శోభాయాత్ర వైభవంగా కొనసాగగా, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
– ప్రధానాలయ పంచతల రాజగోపురరం వద్ద కేసీఆర్ స్వయంగా స్వామివారి పల్లకీని మోశారు.
– మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవంలో భాగంగా, దివ్య విమాన గోపురంపై శ్రీ సుదర్శన చక్రానికి సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేసి, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు.
– ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు కంకణధారణ చేసి పండితులు ఆశీర్వచనం చేశారు.
– సప్త గోపురాలపై ఉన్న కలశాలకు ఏకకాలంలో కుంభాభిషేకం, సంప్రోక్షణ నిర్వహించారు.
– రాజ గోపురాలపై స్వర్ణ కలశాలకు 92 మంది రుత్వికులతో సంప్రోక్షణ చేశారు.
– విమాన గోపురాల శిఖరాలపై కలశ సంప్రోక్షణ కైంకర్యాలను ఘనంగా నిర్వహించారు.