జై శంకర్ ! మన విదేశాంగ శాఖ మంత్రి !
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విదేశాంగ విదేశాంగ విధానం ఎలా ఉండాలో భారత్ ని చూసి నేర్చుకోవాలి అనేంతగా ప్రభావితం చేస్తున్న వ్యక్తీ జై శంకర్ గారు. చైనా,రష్యా,అమెరికా, యూరోపు ఇలా అవతలి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళయినా తన సమాధానాలతో సంతృప్తపరచగలడు లేదా అదే సమయంలో ధీటుగా సమాధానం ఇవ్వగలడు.
రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొనవద్దు అంటూ US స్టేట్ ఆఫ్ సెక్రటరీ అయిన అంటోనీ బ్లిన్ కెన్ ని న్యూ డిల్లీ పంపించింది అమరికా ! ముఖా ముఖీ చర్చల అనంతరం విలేఖరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అమెరికన్ జర్నలిస్ట్ ఒకరు రష్యా మీద అమెరికా ఆంక్షలు విధించినా మీరు ఎందుకు క్రూడ్ ఆయిల్ కొంటున్నారు అని అడిగాడు దానికి జవాబుగా జై శంకర్ గారు మేము మా అవసరాల కోసం కొనే క్రూడ్ ఆయిల్ రెండు నెలలకి సరిపోతుంది కానీ యూరోపు అదే మొత్తం ఆయిల్ ని ఒక పూటలో కొంటున్నది రష్యా నుండి ! విలేఖరితో పాటు అక్కడే ఉన్న బ్లింకెన్ ముఖం మాడిపోయింది. జై శంకర్ నుండి ఇలాంటి సమాధానం వస్తుందని ఊహించని అమెరికన్ విలేఖరి విస్తుపోయాడు ! ఇదివరకు కూడా ఇలాంటి సమావేశాలు జరిగాయి కానీ అమెరికన్ మీడియాకి మన ప్రతినిధులు చాల సౌమ్యంగా సమాధానం ఇచ్చేవారు వినయంగా ఎందుకంటే అది అమెరికా కదా ? యూరోపు మాత్రం తమ అవసరాలని ఒదులుకోలేదు కానీ అవతలి వాళ్ళు వాళ్ళ వాళ్ళ అవసరాలని ఒదిలేసుకోవాలి వీళ్ళని సంతృప్తి పరచడం కోసం !
సాధారణంగా మాట వినని దేశాల మీద అమెరికా ప్రయోగించే మరో అస్త్రం పేరు మానవహక్కుల ఉల్లంఘన ! ఆ పేరుతో ఎదో విధంగా ఆంక్షలు విధించడం పరిపాటి ! ఈ సారి కూడా అంటోని బ్లిన్కెన్ అదే అస్త్రాన్ని ప్రయోగించాలని చూశాడు. భారత్ లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది అంటూ సన్నాయి నొక్కులు నొక్కాడు బ్లింకెన్ కానీ జై శంకర్ గారు బీ ఫిట్టింగ్ రిప్లై ఇచ్చాడు: మనవ హక్కులు అనేవి ఎదో కొన్ని దేశాలకి పరిమితం కాదు అన్ని దేశాలలోనూ జరుగుతున్నాయి కానీ ఆ సంఘటనల వెనుక వ్యక్తిగత కారణాలు కూడా ఉండవచ్చు అయితే భారత దేశం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. మానవ హక్కుల మీద భారత్ కి మంచి అవగాహన ఉంది కూడా ! అమెరికా లో కూడా మానవహక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి అది మేము గమనిస్తున్నాము అని జావాబు ఇచ్చాడు జై శంకర్ గారు. జై శంకర్ గారి మాటల వెనక ఉన్న మర్మం ఏమిటో బ్లింకెన్ కి బాగానే అర్ధమయ్యింది ఎందుకంటే గత 10 రోజుల వ్యవధిలో న్యూయార్క్ నగరం లో వరుసగా ఇద్దరు సిక్కుల మీద దాడులు జరిగాయి. ఇద్దరినీ బాగా కొట్టి వాళ్ళ దగ్గర నుండి డబ్బు తో పాటు ఖరీదయిన వాచీలు దోపిడీ చేసారు ! పరోక్షంగా జై శంకర్ గారు ఈ ఘటనలనే బ్లింకెన్ ముందు ప్రస్తావించారు. మనకి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏ విదేశాంగ మంత్రి కూడా ఈ విధంగా దీటుగా మొఖం మీద కొట్టినట్లు సమాధానం ఇవ్వలేదు అమెరికాకి ! నల్లజాతి వాళ్ళ మీద చూపిస్తున్న జాతి వివక్ష వల్లనే కదా పోయిన సంవత్సరం అమెరికా అట్టుడుకి పోయింది ? వీళ్ళు ఎవరికీ సుద్దులు చెప్తున్నారు ?
ఇంతకీ EAM జై శంకర్ గారు ఎవరు ? ఎందుకింత ప్రాముఖ్యత ఇస్తున్నారు మోదీజీ ?
Dr. జై శంకర్ గారు జపాన్ దేశానికి చెందిన క్యోకో [Kyoko] అనే యువతిని వివాహం చేసుకున్నారు. వీరికి ధ్రువ మరియు అర్జున్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు మరియు మేధా అనే కుమార్తె ఉన్నది.
Dr. జై శంకర్ గారు K.సుబ్రహ్మణ్యం అనే మాజీ IAS ఆఫీసర్ కుమారుడు. సుబ్రహ్మణ్యం గారు మన దేశ అణు విధానానికి రూపకర్త,సిద్ధాంత కర్త. అణు విద్యుత్ రంగానికి మన దేశం తరుపున రాయబారిగా వ్యవహరించిన మేధావి. తన బాచ్ లో టాపర్ కూడా !
Dr. జై శంకర్ గారికి తమిళ, హిందీ,ఇంగ్లీష్,రష్యన్,జపనీస్,చైనీస్ భాషలలో ప్రావీణ్యం ఉంది. హంగేరియన్ భాషలో ప్రవేశం ఉంది. IFS ఆఫీసర్ అయిన శ్రీ జై శంకర్ గారు మొదటగా 1977 లో సర్వీసులో జాయిన్ అయ్యారు. 1979 నుండి 1981 వరకు అప్పటి సోవియట్ యూనియన్ లో indian మిషన్ to సోవియట్ యూనియన్ లో మొదట మూడవ సెక్రటరీగా తరువాత రెండవ సెక్రటరీ గా పనిచేసారు భారత్ తరుపున.ఆ కాలంలోనే రష్యన్ భాష నేర్చుకున్నారు జై శంకర్ గారు. తరువాత న్యూ డిల్లీ వచ్చి అప్పటి ప్రముఖ దౌతవేత్త అయిన గోపాలస్వామి పార్ధసారధి గారి దగ్గర అండర్ సెక్రటరీగా పనిచేసారు అదీ అమరికా డివిజన్ ఆఫ్ ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టేర్నల్ అఫైర్స్ [Americas division of India’s Ministry of External Affairs] లో నేరుగా అమెరికా వ్యవహరాహాల మీద అన్నమాట. గోపాలస్వామి పార్ధసారధి గారి టీమ్ లో ఉంటూ అమెరికా మన దేశంలోని తారాపూర్ అణు విధ్యత్ కేంద్రానికి కావాల్సిన అణు ఇంధనాన్ని సప్లై చేయడానికి గాను జరిగిన ఒప్పందం లో పనిచేసారు.
1985 to 1988 వరకు అమెరికా లోని వాషింగ్టన్ లో ఉన్న భారత రాయబార కార్యాలయంలో first సెక్రటరీ గా పనిచేసారు.
2014 లో మోదీజీ అధికారం లోకి వచ్చిన తరువాత జై శంకర్ గారి పని తీరు మరియు అతనికి ఉన్న బహు భాషా పరిజ్ఞానం ని దగ్గర నుండి చూసిన తరువాత ఒక indian ఫారిన్ సర్వీస్ అధికారిని నేరుగా భారత విదేశాంగ మంత్రిగా నియమించారు మోడీ గారు. మోదీజీ నిర్ణయం వమ్ము కాలేదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జై శంకర్ గారి పేరు దౌత్య వర్గాలలో చర్చనీయాంశం అయ్యింది అంటే దాని వెనుక జై శంకర్ గారి మోదీజీ ఇచ్చిన స్వేచ్చ కూడా ఒక కారణం అయితే ఇచ్చిన బాధ్యతని తన శక్తిమేరకు నిర్వహిస్తున్న జై శంకర్ గారి నిర్విరామ కృషి కూడా ఉంది.
ఇప్పుడు అర్ధమవుతున్నదా ? పుతిన్ తో నేరుగా రష్యన్ భాషలోనే మాట్లాడగలరు జై శంకర్ గారు అలాగే చైనా విదేశాంగ మంత్రితో మాండరిన్ భాషలో మాట్లాడగలరు అలాగే జపాన్ ప్రధాని లేదా జపాన్ విదేశాంగ మంత్రితో నేరుగా జపనీస్ భాషలో మాట్లాడగలరు. సుదీర్ఘకాలం భారత్ తరుపున వివిధ దేశాలలో దౌత్యవేత్తగా పని చేసిన అనుభవం కి తోడు తన తండ్రి అయిన మాజీ IAS అధికారి శ్రీ సుబ్రహ్మణ్యం గారి శిక్షణ తో పాటు అప్పట్లో ప్రముఖ దౌత్యవేత్త అయిన గోపాలస్వామి పార్ధసారధి గారి శిష్యరికం వెరసి నేటి జై శంకర్ గారు అన్నమాట !
మహా అయితే సీనియర్ డిప్లోమాట్ గా రిటైర్ అయ్యే వారు శ్రీ జై శంకర్ గారు కానీ మోదీజీ దృష్టిలో పడడం అనేది ఆయన అదృష్టం తో పాటు మన దేశ అదృష్టం అని కూడా చెప్పవచ్చు !
ఇప్పటి మంత్రివర్గంలో ఇద్దరు ప్రముఖులు ఒకరు శ్రీ అజిత్ దోవల్ గారు మాజీ IPS అధికారి అయితే రెండో వారు శ్రీ జై శంకర్ గారు మాజీ IFS అధికారి. ఇద్దరూ కూడా కాబినెట్ రాంక్ అధికారులే ! ఇద్దరూ తమ తమ రంగాలలో అద్భుత ప్రతిభని చూపిస్తూ మన దేశ జెండాకి గౌరవం తెస్తున్నారు విదేశాలలో ! దీని వెనుక మోదీజీ కృషి కూడా ఉంది. రాజకీయ నాయకులని నియమించకుండా ఆ రంగాలలో అనుభవం ఉన్నవారిని కాబినెట్ రాంక్ అధికారులుగా గా ఎంచుకోవడం అనేది సాహసోపేతమయిన చర్య అవుతుంది. ఇలాంటి సాహాస నిర్ణయం తీసుకోవడం ఇతరుల వల్ల కానే కాదు