శ్రీవారి మెట్లు.. మే 5 వ తేదీ నుండి ప్రారంభం..


అభివృద్ధి చేసి పునర్నిర్మాణం కొన్ని చోట్ల చేశారు
శ్రీవారు మొట్టమొదటిసారిగా తిరుమల చేరుకున్న అతి పవిత్ర మార్గము – శ్రీ వారి మెట్లు
శ్రీనివాసుడు పద్మావతిని పరిణయమాడిన తరువాత వారు ఈ దారిగుండానే తిరుమల చేరుకున్నారు .
తిరుమలకు ఇది అతి పురాతన నడకదారి.
ఒకప్పుడు చంద్రగిరి నుండి తిరుమలకు రాకపోకలన్నీ ఈ దారి గుండానే జరిగేవి .
శ్రీ కృష్ణ దేవరాయలు , అన్నమయ్య తదితర మహా భక్తులు ఎందరో ఈ దారి గుండానే తిరుమలకు వెళ్లి స్వామి వార్ని దర్శించుకున్నారని ప్రతీతి.
తిరుమల కొండపైకి రెండు మార్గాలున్నాయి. అలిపిరి నుండి వేళ్ళే దారి అందరికీ పరిచయమైనది. ఈ దారిలో వేగంగా నడిస్తే నాలుగు గంటల సమయం పడుతుంది. తిరుమల చేరుకోవడానికి రెండవ కాలిబాట ”’శ్రీవారి మెట్టు”’ నుండి ఉంది. ఈ మార్గంలో ప్రయాణం ఒక గంట మాత్రమే పడుతుంది.
#తిరుపతి నుంచి #తిరుమలకు కాలి నడకన వెళ్ళుటకు అలిపిరి దగ్గర నుంచి వున్న మార్గం కాక శ్రీనివాస మంగాపురం ఆలయానికి అతి సమీపం నుంచి వున్న మరొక మార్గమే శ్రీ వారి మెట్టు. అలిపిరి మార్గంలో వున్న మొత్తం మెట్ల సంకఖ్య కన్నా శ్రీ వారి మెట్టు మార్గంలో వున్న మెట్లు చాలా తక్కువ. ఒక సగటు వ్యక్తి ఈ మార్గము ద్వారా ఒకటిన్నర గంటలో కొండ పైకి చేరుకొనవచ్చు.

తిరుమలకు దగ్గరి దారి..
తిరుమల కొండపైకి రెండు మార్గాలున్నాయి. అలిపిరి నుండి వేళ్ళే దారి అందరికీ పరిచయమైనది. ఈ దారిలో వేగంగా నడిస్తే నాలుగు గంటల సమయం పడుతుంది. తిరుమల చేరుకోవడానికి రెండవ కాలిబాట ”’శ్రీవారి మెట్టు”’ నుండి ఉంది. ఈ మార్గంలో ప్రయాణం ఒక గంట మాత్రమే పడుతుంది. పాలు, పెరుగు, పూలు వంటి పదార్ధాలు కొండపైకి తీసుకొని వెళ్ళి అమ్ముకొనేవారు ఈ మార్గంలోనే వెళతారు. ఈ మార్గం రద్దీ లేకుండా, ప్రకృతి రమణీయతతో సుందరంగా ఉంటుంది. ఈ దారిని నూరుమెట్ల దారి అని అంటారు. అనగా ఇవి నూరు మెట్లె కాదు. ఇవి సుమారు రెండు వేలా ఐదువందల మెట్లున్నాయి. తిరుమలకు వెళ్లడానికి ఇది చాల దగ్గరి దారి. గతంలో శ్రీనివాస మంగాపురం వద్ద మంగాపురం అనే రైల్వే స్టేషను వుండేది. ఆ రైలు మార్గంలో వెళ్లే అనేక రైళ్లు అక్కడ ఆగేవి. అక్కడి నుండి భక్తులు నూరు మెట్ల దారి గుండా కొండపైకి వెళ్లే వారు. ప్రస్తుతం ఈ మెట్లదారి అంత ప్రాచుర్యంలో లేదు. స్థానికులకు తప్ప ఇక్కడ మరొక మెట్ల దారి వున్నదనే సంగతి సుదూర ప్రాంతాల వారికి తెలియదు.
19వ శతాబ్ది తొలినాళ్ళకు చెందిన ఈస్టిండియాకంపెనీ ఉద్యోగి, యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఈ బాట గురించి తమ కాశీయాత్రాచరిత్ర గ్రంథంలో వ్రాశారు. 1830ల నాటికే శ్రీనివాసుని పాదం ఇక్కడ ఉండేది. పడమటి దేశస్థులు అక్కడ నుంచి ఎక్కుతారని ఆయన వ్రాశారు .

తిరుమల పట్టణానికి కళ్యాణీ డ్యాము నుండి నీటి సరఫరాకి ఈ మార్గం మీదుగా పైపులైను వేసిన తరువాత నుండి ఈ దారి కొంత అభివృద్ధి చెందింది. అలిపిరి కాలిబాట మొత్తం సుమారుగా 9 కిలోమీటర్లు ఉంటే ఈ కాలిబాట సుమారుగా మూడు కిలోమీటర్లు లోపే ఉంటుంది. అలిపిరి మార్గం ప్రస్తుతం అధికంగా వాడకంలో ఉన్నందున శ్రీవారి మెట్టునుండి వెళ్ళే దారి గురించి చాలా మందికి తెలియదు. ఇది కేవలం 2.1 కీ.మీ. మాత్రమే ఉంటుంది. అయితే ఈ కాలిబాటతో సమస్య ఏమిటంటే దీనికి చేరుకోవడానికి రవాణా సౌకర్యాలు ఎక్కువగా లేవు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు ఇక్కడికి తిరుపతి నుండి, చంద్రగిరి, శ్రీనివాస మంగాపురం ల మీదుగా ఒక బస్సు నడుపుతున్నారు. దేవస్థానం వారి ఉచిత బస్సు సేవ కూడా రైల్వే స్టేషను, బస్ స్టాండ్, మరియు అలిపిరి నుండి శ్రీవారి మెట్టు వరకూ అందుబాటులో ఉంది. లేదా శ్రీనివాస మంగాపురం చేరుకొని అక్కడి నుండి ఆటోలో వెళ్లవచ్చు. శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారి మెట్టు సుమారుగా 6 కిలోమీటర్లు ఉంటుంది. ఈ దారిగుండానే వేంకటేశ్వరుడు వివాహానంతరం ఆరు నెలలు కాలం అగస్త్యాశ్రమంలో గడిపి తరువాత తిరుమల చేరుకున్నాడని పురాణ కథ. నడిరేయి ఏ జామునో అలమేలు మంగను చేరడానికి దిగి వచ్చే స్వామి ఒక అడుగు ఈ “శ్రీవారి మెట్టు”పై వేసి రెండవ డుగు అలమేలు మంగాపురంలో వేస్తాడని ప్రతీతి. చంద్రగిరిని వేసవి విడిదిగా చేసుకొన్న విజయనగర చక్రవర్తులు శ్రీవారి మెట్టునుండ ఉన్న మెట్లదారిలో తిరుమలేశుని దర్శనం చేసుకొనేవారు. తన దేవేరులతో కలిసి కృష్ణ దేవరాయలు ఈ మార్గంలో అనేక పర్యాయాలు నడచి స్వామిని దర్శించుకొన్నాడు.

ప్రస్తుతం ఈ మార్గాన్ని కూడా అభివృద్ధి చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానములు సంస్థ కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా దారి ఆరంభంలో “పాదాల మండపం”, మరియు భక్తుల సౌకర్య సదుపాయాలను నిర్మిస్తారు. ఇందుకు 6 కోట్ల రూపాయల వ్యయాన్ని అంచనా వేశారు. వసతి గృహంగా “కృష్ణదేవరాయ సదనం” కూడా 4.3 కోట్ల రూపాయలతో నిర్మించనున్నారు.

అలిపిరి నుంచి ఉన్న మెట్ల దారిలో మెట్లోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తోంది. అయితే 2007, 2008 సంవత్సరాలలో కొన్ని మెట్లోత్సవాలు శ్రీవారి మెట్టునుండి ఉన్న బాటలో జరుపుతున్నారు. టీటీడీ, దాస సాహిత్య ప్రాజెక్ట్ సంయుక్తంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. చిన్నారులు పెద్దసంఖ్యలో పాల్గోవడంతో తక్కువదూరం ఉండే శ్రీవారి మెట్ల మీదుగా ఈ యాత్ర జరపడం అనుకూలంగా ఉంటున్నది.

About The Author