శిథిలావస్థలో హసన్ సాహెబ్ గృహం..!
ప్రముఖ నాదస్వర విద్వాంసుడు,పద్మశ్రీ అవార్డు గ్రహీత షేక్ హసన్ సాహెబ్ గంపలగూడెం మండలం లోని గోసవీడు గ్రామంలో జన్మించారు. ఆయన బాల్యం గోసవీడులో సాగింది.విద్యాభ్యాసం అనంతరం నాదస్వర విద్వాంసుడిగా పేరు పొందారు.
ఆయన తెలుగు రాష్ట్రాలలోని వివిధ దేవాలయాల్లో సంగీత విద్వాంసుడిగా సేవలు అందించారు. నాదస్వరంలో పలువురికి శిక్షణ ఇచ్చారు.స్వాతంత్ర్య సమర యోధుడిగా పేరు పొందారు.ఆయనకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి.మరణానంతరం ఆయనకు కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది.భద్రాచలం లో సీతారాముల దేవస్థానంలో నాదస్వర విద్వాంసుడిగా సేవలు అందించిన ఆయన పదవీ విరమణ తర్వాత తిరువూరులో ఉన్నారు.గోసవీడు గ్రామంలో ఆయన నివసించిన ఇల్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది.ఇంటి చుట్టూ తుప్పలు పెరిగాయి.ఈ ప్రాంతాన్ని స్మారక కేంద్రంగా ప్రకటించి, ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రచయిత యం.రాం ప్రదీప్ గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.