నేటి నుండి మారిన పాన్ కార్ఢు రూల్స్…


_మారిన పాన్ కార్డు రూల్ మే 26న అమలులోకి రానుంది. ఇప్పటికే ఆదాయపు పన్ను చట్టంలోని 114బీ రూల్ ప్రకారం బ్యాంకులో ఒక రోజులో రూ.50,000 కన్నా ఎక్కువ డిపాజిట్ చేయాలంటే పాన్ కార్డ్ వివరాలు వెల్లడించడం తప్పనిసరి అనే రూల్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. 2. కానీ ఈ రూల్‌లో యాన్యువల్ లిమిట్ కవర్ కాదు. దీంతో సీబీడీటీ కొత్త రూల్ అమలు చేస్తోంది. ఇవాళ్టి నుంచి భారీగా ఆర్థిక లావాదేవీలు జరిపేవారికి కొత్త రూల్ అమల్లోకి వస్తుంది. ఈ రూల్ ప్రకారం ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల కన్నా ఎక్కువ విత్‌డ్రా చేసినా, డిపాజిట్ చేసినా తన పాన్ నెంబర్ వెల్లడించాలి_

_3. ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకుల్లో మాత్రమే కాదు కోఆపరేటీవ్ బ్యాంకుల్లో రూ.20 లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్ చేసినా ఈ రూల్ వర్తిస్తుంది. అయితే లావాదేవీలు జరిపే ప్రతీ ఒక్కరికీ పాన్ కార్డ్ లేదు. మరి అలాంటివారి పరిస్థితి ఏంటన్న సందేహాలు ఉన్నాయి. పాన్ కార్డ్ లేనివారు తమ ఆధార్ నెంబర్ వెల్లడించాలి 4. ఒకేసారి రూ.20 లక్షల ట్రాన్సాక్షన్ చేసినా, వేర్వేరు సందర్భాల్లో మొత్తం కలిపి రూ.20 లక్షల లావాదేవీలు జరిపినా ఈ రూల్ వర్తిస్తుంది. అయితే ఈ లావాదేవీలు జరిపే సందర్భంలో పాన్ నెంబర్, ఆధార్ నంబర్లను తీసుకునే వ్యక్తులు అవి సరైన వివరాలేనా కాదా అని నిర్థారించుకోవాలని సీబీడీటీ వెల్లడించింది. 5. ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే ఆధార్ నెంబర్ ద్వారా పాన్ కార్డుల్ని జనరేట్ చేస్తోంది. పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయాలని కోరుతోంది. ఒకవేళ భారీ మొత్తంలో లావాదేవీలు ప్లాన్ చేసినవాళ్లు తమ దగ్గర పాన్ కార్డ్ లేకపోతే లావాదేవీ చేసే తేదీకి కనీసం ఏడు రోజుల ముందు పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని CBDT నోటిఫికేషన్ చెబుతోంది. 6. ఖాతాదారులు బ్యాంకులో లేదా పోస్ట్ ఆఫీసులో కరెంట్ అకౌంట్, క్యాష్ క్రెడిట్ అకౌంట్ ఓపెన్ చేసినా పాన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ వివరాలు ఇవ్వడం తప్పనిసరి. ఈ కొత్త రూల్స్‌ని అమలు చేసేందుకు CBDT ఆదాయపు పన్ను నిబంధనలు-1962 లో పలు సవరణలు చేసింది. ఈ లావాదేవీల్లో ఇచ్చే పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డులోని డెమోగ్రఫిక్, బయోమెట్రిక్ సమాచారాన్ని ప్రిన్సిపాల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ (సిస్టమ్స్), డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ (సిస్టమ్స్) సెక్షన్ 139ఏ ప్రకారం ధృవీకరిస్తుంది. 7. సెక్షన్ 139A ఏ వ్యక్తులు పాన్ కార్డ్ కోసం అప్లై చేయాలో, ఎవరు పాన్ కార్డ్ వివరాలను వెల్లడించాలో తెలుపుతుందని, ఈ సెక్షన్ అందరు వ్యక్తుల్ని కవర్ చేయదని, అందుకే సీబీడీటీ రూ.20 లక్షల కన్నా ఎక్కువ లావాదేవీలకు పాన్ కార్డ్ లేదా ఆధార్ నెంబర్ తప్పనిసరి చేసిందని *Taxbuddy.com* ఫౌండర్ సుజిత్ బంగార్ తెలిపారు…!!_

About The Author