ఉప్పు మానేస్తే గుండె పదిలం…


ఎవరైతే డైట్‌లో ఉప్పు మానేస్తారో వారికి గుండెపోటు, గుండె సంబంధ వ్యాధుల ముప్పు 20 శాతం మేర తగ్గిపోతుందని యూకే పరిశోధకులు తేల్చారు. గుండె సంబంధ వ్యాధులు కలిగి ఉండి, 40-70 ఏండ్ల వయసున్న 5 లక్షల మందిపై అధ్యయనం నిర్వహించారు.

లండన్‌, ఆగస్టు 27: ఎవరైతే డైట్‌లో ఉప్పు మానేస్తారో వారికి గుండెపోటు, గుండె సంబంధ వ్యాధుల ముప్పు 20 శాతం మేర తగ్గిపోతుందని యూకే పరిశోధకులు తేల్చారు. గుండె సంబంధ వ్యాధులు కలిగి ఉండి, 40-70 ఏండ్ల వయసున్న 5 లక్షల మందిపై అధ్యయనం నిర్వహించారు. ఎవరైతే తమ ఆహారంలో ఉప్పు చేర్చుకోలేదో వారిలో గుండె సంబంధ వ్యాధుల ముప్పు 18 శాతం మేర తగ్గిపోయినట్టు తేల్చారు. అప్పుడప్పుడు మాత్రమే ఉప్పు వాడేవారిలో 15 శాతం మేర జబ్బు తగ్గుముఖం పట్టినట్టు గుర్తించారు. ముఖ్యంగా ఉప్పు తగ్గిస్తే ఆర్ట్రియల్‌ ఫిబ్రిలేషన్‌ (గుండె దడ) తగ్గిపోతున్నట్టు పరిశోధకులు కనుగొన్నారు

About The Author