విశాఖలో జర్నలిస్టుల సంబరాలు..
ఇళ్ల స్థలాలు కేటాయించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు
..
ఏపీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్న ఏపీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల విశాఖలో జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు సంబరాలు జరిపారు. కేక్ కట్ చేసి పరస్పరం స్వీట్లు పంచుకున్నారు .సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయం అని కొనియాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు రావులవలస రామచంద్ర రావు,విశాఖ అక్రిడిడేట్డ్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ గౌరవ అధ్యక్షులు రాఘవేంద్ర రెడ్డి, సొసైటీ అధ్యక్షులు బి.రవికాంత్ ,విశాలాంధ్ర బ్యూరో రామకృష్ణ,హెచ్ఎంటీవీ బ్యూరో చీఫ్ అనురాధ , ఏపీడబ్ల్యూజే జాయింట్ సెక్రెటరీ గోగుల శ్రీనివాసరావు తో పాటు పలువురు ఫోటోగ్రాఫర్లు కెమెరామెన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘ నాయకులు రామచంద్ర రావు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం తీసుకొని రీతిన జర్నలిస్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిర్ణయించిందని అన్నారు వివిధ సంక్షేమ పథకాలు మాదిరిగానే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో కూడా అర్హులను గుర్తించడం అభినందనీయం అన్నారు. విశాఖ అక్రిడిడేటెడ్ హౌసింగ్ సొసైటీ గౌరవ అధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రతి హామీ నెరవేర్చిన సీఎం జర్నలిస్టుల విషయంలో అత్యంత సానుకూలంగా వ్యవహరించారని అన్నారు. జర్నలిస్టుల కు ఇళ్ల స్థలాల కేటాయించడం ఆర్థిక ప్రగతికి సూచిక గా పేర్కొన్నారు. హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు బి .రవికాంత్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు హర్షనీయం అన్నారు తొలిదశ నుంచి విశాఖ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తుందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విశాఖ ప్రధాన కార్యదర్శి చంద్ర మోహన్, విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ జర్నలిస్ట్ గౌరవ అధ్యక్షులు జి జనార్దన్ రావు, సలహాదారులు ధవలేశ్వరం రవికుమార్, సహాయ కార్యదర్శి శివప్రసాద్, ఉపాధ్యక్షులు డి మురళీకృష్ణ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు బొల్లం కోటేశ్వరరావు,
ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు గంటల ప్రసాద్ ,కమాలుద్దీన్ మౌలానా,సీనియర్ జర్నలిస్టు ఎస్ వి. బి. కుమార్, ఈశ్వర్ రెడ్డి, పీటర్ ప్రదీప్, జార్జ్ తదితరులు పాల్గొన్నారు