కార్పోరేట్ స్థాయిలో అంత్యక్రియల కేంధ్రం

కార్పోరేట్ స్థాయిలో అంత్యక్రియల కేంధ్రం.
ఒక్కసారి ఆలోచించండి.

మన సమాజం ఎక్కడికి వెళుతోంది?

భారతదేశం యొక్క మానవీయ విలువలు ఇబ్బందికరంగా ఉన్నాయని చూపించే ప్రత్యేక ప్రదర్శన.

అంత్యక్రియలు నిర్వహించే సంస్థ.
కంపెనీ సభ్యత్వ రుసుము రూ. 37,500/-

ఇందులో ఏడ్చేవాళ్ళు, పండితులు, మంగలి,పూలదండలు అంచక్రియల సామాగ్రి, భుజంపట్టి వెంట నడవడం, వంటి వ్యక్తులందరూ కంపెనీ వాళ్ళే

ఇక్కడ అన్ని మతాల వాళ్ళకి, వాళ్ళ వాళ్ళ సంప్రదాయాలలో దహన క్రియలు నిర్వహించబడును.

కంపెనీకి ఇప్పుడు 50 లక్షల లాభాన్ని ఆర్జించిన దేశం యొక్క కొత్త స్టార్టప్‌గా దీనిని పరిగణించవచ్చు.

కాని రాబోయే కాలంలో ఈ వ్యాపారం 2000 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది.

ఎందుకంటే భారతదేశంలో, కుటుంబ సంబంధాలు, డబ్బుతో ముడిపడి,అతిత్వరలో అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి.

ఇలాంటి సంబంధాలను కొనసాగించడానికి మన దేశంలో చాలా మందికి సమయం లేదని “కంపెనీ”కి బాగా తెలుసు.

రాబోయే రోజుల్లో కొడుకులు,కూతుర్లు లేదా సోదరీ సోదరులు లేదా ఇతర బంధువులు, ఎవ్వరు పాల్గొనరని,ఫోన్లు మాత్రమే చేస్తారని ఆ కంపెనీ వాళ్ళకి తెలుసు. .

About The Author