వాడపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి…


వాడపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి
????పంచ నరసింహ క్షేత్రాలు????
నల్గొండ జిల్లా, మిర్యాలగూడ తాలూక,
దామరచర్ల మండలంలో కృష్ణా ముచికుందా
(మూసీ) నదుల సంగమతీరాన హరిహరులకు
బేధంలేదని నిరూపిస్తూ వాడపల్లి క్షేత్రంలో
శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ అగస్త్యేశ్వరుడు
కొలువుతీరి వున్నారు .

6000 సంవత్సరాలక్రితం అగస్త్య మహాముని
తీర్ధయాత్రలు చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చి,
నదీ సంగమంలో స్నానంచేసి,
ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించారు.
అగస్త్య మహామునిచే ప్రతిష్టింపబడిన
లింగంగనుక అగస్త్యేశ్వరుడయ్యాడు.
శివ కేశవులకు బేధములేదని అగస్త్య మహాముని
ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామిని కూడా ప్రతిష్టించారు.
తర్వాత కొంతకాలానికి రక్షణలేని కారణంగా
విగ్రహాలచుట్టూ పుట్టలు లేచాయి.

రెడ్డిరాజులకాలంలో ఈ ప్రదేశంలో
రెండు వైపుల నీరు, ఒక వైపే త్రోవ వున్నదని గుర్తించి,
ఈ ప్రదేశంలో కోట, ఇళ్ళు కట్టుకుంటే సురక్షితంగా
వుంటాయనే వుద్దేశ్యంతో బాగు చేస్తున్న సమయంలో
లింగాన్ని చూసి, గుడి కట్టించి పూజించసాగారు.
రెడ్డి రాజులిక్కడ కోటలు, ఊళ్ళూ నిర్మించుకుని
చాలాకాలం పరిపాలించారు

ఆ కాలంలో ప్రసిధ్ధ పట్టణంగా పేరుపొందిన
ఈ పట్టణాన్ని అగస్త్యపురము, నర్సింహాపురం,
వీరభద్రపురం అను పేర్లతో పిలిచేవారు.

వాడపల్లిలో దక్షిణ ముఖంగా వున్న
లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం చిన్నదయినా,
స్వామి భక్తుల అభీష్టాలను నెరవేర్చే స్వామిగా
ప్రఖ్యాతి చెందారు.

స్వామి తొడ మీద అమ్మవారు
కూర్చుని వున్నట్లు వుంటుంది.
గర్భ గుడి లో స్వామి ముఖం ఎదురుగా
అదే ఎత్తులో ఒక దీపం, కింద ఇంకో దీపం వుంటాయి.
కిందవున్న దీపం కదలదు. నిశ్చలంగా వుంటుంది.
పైన స్వామి ముఖానికి ఎదురుగా వున్న దీపం చిరుగాలికి రెప రెపలాడుతున్నట్లుంటుంది
(గర్భ గుడిలో ఆ దీపం కదిలే గాలి లేకపోయినా).
ఆ కదలికకి కారణం ఈ క్షేత్రంలో స్వామి
తీసుకొనే వుఛ్ఛ్వాశ నిశ్వాసలని చెపుతారు.
స్వామి అస్తిత్వాన్ని నిరూపించే దీపాలున్నాయి గనుక,
ఈ స్వామిని దీపాలయ్య అని పిలుచుకుంటారు భక్తులు. ఈ ఆలయంలో ఒక దండం లాంటి దానితో పూజారి భక్తుల వీపు మీద కొడతారు.
దుష్టగ్రహ నివారణకోసం అలా చేస్తారుట.

ఓం నమో లక్ష్మీనరసింహాయ నమః????????????????????

About The Author