నరాల బలహీనత సమస్యకు శాశ్వత పరిష్కారం…
1.వేలు మందం ఉన్న అతిబల చెట్టు కట్టలను ఆరింటిని(6) తీసుకుని రాగి తీగతో చుట్టాలి. తరువాత గిన్నెలో పాలు పోసి ఈ కట్టెలతో కలుపుతూ మరిగించాలి. ఇలా మరిగించడం వల్ల పాలు గట్టిగా ముద్దలా తయారవుతాయి. ఈ ముద్దను ఆరబెడితే పొడి తయారవుతుంది. ఈ పొడిలో చక్కెర కలుపుకుని తినడం వల్ల నరాల బలహీనత సమస్య తగ్గడంతో పాటు అమితమైన బలం కలుగుతుంది.
2.అశ్వ గంధ పొడి, అతి మధురం పొడిని సమపాళ్లల్లో తీసుకుని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో కలిపి తాగాలి. రోజుకు రెండు పూటలా రెండు నెలల పాటు తాగడం వల్ల నరాల బలహీనత సమస్య తగ్గు ముఖం పడుతుందని.
వీటితో పాటు అవిసె గింజలు, చేపలు, ఆక్రోట్, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటి ఎక్కువగా తీసుకోవాలి. తీపి పదార్థాలకు, జంక్ ఫుడ్ కు, ప్రాసెస్డ్ ఫుడ్, వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే ఒత్తిడి తగ్గడానికి , ఆందోళన తగ్గడానికి యోగా, ధ్యానం వంటి వాటిని చేయాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల నరాల బలహీనత సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చ
*ఇట్లు,*
*మీ ఆయుర్వేద వైద్యులు,*
*Dr. Venkatesh 9392857411*.