టాలీవుడ్ లో మరో విషాదం.. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతి..
టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని తన నివాసంలో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, కమెడియన్ ఇలా అన్నీ రకాల ప్రాతలను పోషించి తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు కైకాల. నిర్మాతగానూ సినిమాలు రూపొందించారు. ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందారు సత్యనారాయణ. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో కైకాల ఒకరు.
వ్యక్తిగతం
పేరు: కైకాల సత్యనారాయణ
పుట్టిన తేదీ: 25 జూలై, 1935
తల్లిదండ్రులు: సీతారామమ్మ, లక్ష్మీనారాయణ
భార్య: నాగేశ్వరమ్మ
సంతానం: లక్ష్మీనారాయణ, కేవీ రామారావు, పద్మావతి, రమాదేవి