పరిగడపున సబ్జగింజల నీళ్లు తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?


పరిగడపున సబ్జగింజల నీళ్లు తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

1.షుగర్ స్థాయిని అదుపులో వుంచుతుంది:-
రక్తంలో ఇన్సులిన్ స్థాయిని సబ్జ గింజలు మెరుగుపరుస్తాయ్. మధుమేహం ఉన్న వారికి సబ్జ గింజలు చాలా దోహదపడతాయ్.

2.గుండెకు మంచిది:-
సబ్జ గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు వుంటాయ్. ఇవి ఆల్ఫా లైనోలెనిక్ యాసిడ్లను ఉత్పత్తి చేస్తాయ్. దీని ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి రోజుకు కనీసం ఒక టీ స్పూన్ సబ్జ గింజలనైనా తాగే ప్రయత్నం చేయండి.

3.మలబద్దకం:-
ఆహారం సరిగ్గా జిర్ణం కాక మలబద్దకంతో బాధపడేవారు ఒక గ్లాసు నీటిలో సబ్జగింజలను వేసుకొని తాగాలి. ప్రతీ రోజు పడుకునే ముందు ఇలా కొన్న సబ్జ గింజలను వేసుకొని తాగడం వల్ల ఉదయం మలబద్దకం సమస్యతో బాధపడుకుండా వుంటారు.

4.జీర్ణ క్రియ మెరుగుపరుస్తుంది:-
సబ్జ గింజల్లో ఫైబర్ శాతం సంమృద్దిగా వుండడం వల్ల కడుపులో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉదయం లేవగానే తాగడం వల్ల కడుపును కూడా శుభ్రంగా వుంచుతుంది. కడుపులో వుండే వ్యర్థపదార్ధాలు బయటకు వెళ్లడానికి సహాయం చేస్తుంది.

5.బరువు తగ్గించడంలో దోహదపడుతుంది:-
సబ్జ గింజల నీళ్లు తాగడం వల్ల కడపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీంతో తక్కువ ఆహారాన్ని తీసుకొంటారు. ఇలా పరోక్షంగా బరువును సబ్జగింజలు తగ్గిస్తాయ్. ప్రతి రోజు భోజనం చేసే ఒక గంట ముందు సబ్జ గింజల పానియం తాగితే ఖచ్చితంగా బరువు తగ్గుతారు.

ఇట్లు,
మీ ఆయుర్వేద వైద్యులు,
Dr. Venkatesh 9392857411.

About The Author