ప్చ్… సజ్జలకు .. అడ్వాన్స్,,, గిప్ట్ ఐపీసీ సెక్షన్ 153, 505, 125 ప్రకారం కేసు నమోదు


ఎన్నికల నోటిఫికేషన్ ఆరంభం నుంచి వైసీపీకి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. చివరకు వైసీపీ కీలక నేత సజ్జలపై పోలీసులు కేసు నమోదు చేయడంతో కొందరు వైసీపీ నేతలకు మింగుడుపడడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే, రేపటి రోజున అధికారంలోకి రాకపోతే పార్టీ పరిస్థితి ఏంటనే చర్చ జోరందుకుంది. అసలు ఏం జరిగింది. తాజాగా ఏపీ ప్రభుత్వం సలహాదారు, వైసీసీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కారణమేంటంటే.. రెండు రోజుల కిందట తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో.. కౌంటింగ్ ఏజెంట్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే … ఇప్పటి వరకూ తాడేపల్లి దర్బారు వైపు నిక్కి చూడటానికి బేంబేలెత్తే పోలీసులు , కేసు నమోదు చేశారు. ఇంతకీ సజ్జల ఏం చేశారు. ? బుధవారం తాడేపల్లిలో వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లతో సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మనం ఏమీ ఇక్కడ కూర్చొని రూల్స్ ఫాలో కావడానికి రాలేదని, సాధ్యమైనంత వరకు వాదన చేసేవాళ్లు కూర్చోవాలన్నారు. కౌంటింగ్ ఏజెంట్స్.. రూల్స్ ఫాలో అయ్యి వెనక్కి తగ్గేవాళ్లు రావద్దని తేల్చి చెప్పేశారు. టీడీపీ, జనసేన ఏజెంట్లకు ప్రతి విషయంలో అడ్డం తిరగాలని సూచన చేశారు. సజ్జల వ్యాఖ్యలు ముమ్మాటికీ ఎన్నికల నియమావళికి ఉల్లంఘించడమేనని టీడీపీ ఆరోపించింది. ఈ క్రమంలో టీడీపీ నేతలు దేవినేని ఉమ, న్యాయవాది గుడపాటి లక్ష్మీనారాయణ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ సెక్షన్ 153, 505, 125 ప్రకారం మూడు సెక్షన్ల కింద సజ్జలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

About The Author