ఎక్కువ కాలంపాటు ఆరోగ్యంగా జీవించాలంటే పాటించాల్సిన 10 సులభమైన ఆయుర్వేద చిట్కాలు


ఎక్కువ కాలంపాటు ఆరోగ్యంగా జీవించాలంటే పాటించాల్సిన 10 సులభమైన ఆయుర్వేద చిట్కాలు

1.ఉదయం నిద్ర లేచిన వెంటనే టీ, కాఫీలకు బదులుగా ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిని తాగాలి.

2.శరీర బరువు ఎలా ఉందో చెక్‌ చేసుకోవాలి.

3.బరువుకు తగిన విధంగా ఆ రోజు తినాల్సిన ఆహారాలను ఎంచుకోవాలి.

4.రోజూ ఒకే సమయానికి భోజనం చేయాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒకే సమయానికి ఆహారాన్ని తీసుకోవాలి.

5.తీసుకునే భోజనంలో ద్రవ, ఘనాహారాలు ఉండాలి. జీర్ణాశయంలో పావు వంతు ఖాళీ ఉంచాలి. జీర్ణం సరిగ్గా అవుతుంది.

6.భోజనానికి, భోజనానికి మధ్య కనీసం 4 నుంచి 5 గంటల వ్యవధి ఉండాలి. రోజులో ఒక్కసారి అయినా కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలసి భోజనం చేయాలి.

7.భోజనం చేసేటప్పుడు నీరు అస్సలు తాగరాదు. తప్పదనుకుంటే చాలా స్వల్పంగా నీటిని తాగాలి. భోజనానికి ముందు, భోజనం చేసేటప్పుడు, చేశాక ఎట్టి పరిస్థితిలోనూ చల్లని నీరు, పానీయాలను తాగరాదు.

8.వారంలో ఒక్కసారి నూనెతో శరీరాన్ని మసాజ్ చేయాలి.

9.శరీరం ఉన్న స్థితిని బట్టి నిత్యం వ్యాయామం చేయాలి. ఆరోగ్యవంతమైన వ్యక్తులు వారంలో కనీసం 3 రోజులు వ్యాయామం చేసేలా ప్లాన్‌ చేసుకోవాలి.

10.రోజూ, వారం వారం చేయాల్సిన కార్యక్రమాలను తప్పనిసరిగా పూర్తి చేయండి. ఆరోగ్యం, వ్యాయామం, భోజనం విషయాల్లో పెట్టుకునే నియమాలను పాటించండి.

*ఇట్లు,*
*మీ ఆయుర్వేద వైద్యులు,*
*Dr. Venkatesh 9392857411.*

About The Author