బెల్లానికి వినాయకచవితి డిమాండ్…
దేశంలో నెలకొన్న పండుగల డిమాండ్ మరియు బెల్లం ఉత్పాదక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో నిల్వలు అడుగంటాయి. గడిచిన రెండు వారాలుగా ఉత్పాదక రాష్ట్రాలలో భారీ డిమాండ్ నెలకొంటున్నది. ఉత్తరప్రదేశ్లోని శీతల గిడ్డంగుల సరుకు సీజన్ ప్రారంభానికి ముందే నిల్వలు హరించుకుపోనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు ద్వితీయార్థం నుండి అక్టోబర్ వరకు సమృద్ధిగా వర్షాలు కురవగలవని భారత వాతావరణ శాఖ సూచిస్తోంది. ఇలాంటి పరిస్థితులలో పశ్చిమ ఉత్తరప్రదేశ్లో కొత్త సరుకు రాబడులు జాప్యమయ్యే అవకాశం ఉండడ వలన ధరలు మందగమనంలో చలించే అవకాశం లేదు. ఎడతెరిపిలేదని ధరల పెరుగుదల వలన దిగ్గజ వ్యాపారులు మరియు రైతులు తమ సరుకు విక్రయించి ప్రయోజనం పొందుతున్నారు. అయినప్పటికీ గత వారం ధరలు పైకి ఎగబాకుతూనే ఉన్నాయి.
కర్ణాటకలోని మాండ్యా ప్రాంంతంలో గతవారం 70-75 వాహనాల సరుకు రాబడి కాగా దాదాపు 80 శాతం సరుకు పొరుగు రాష్ట్రాలకు రవాణా అయినందున ధర ప్రతి క్వింటాలుకు రూ. 100–125 వృద్ధి చెంది ఎరుపు రకం రూ. 3845-3850, సింగిల్ ఫిల్టర్ రూ. 3900-3950, డబుల్ ఫిల్టర్ రూ. 4050, చదరాలు రూ. 4400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున
సరుకు తయారీ కుంటుపడినందున శిమోగాలో గత వారం 18-20 వాహనాల శీతల
గిడ్డంగులలో సరుకు రాబడిపై దేశీ బెల్లం రూ. 4100-4200, మహాలింగాపూర్ 3–4 వాహనాలు సురభి రకం రూ.3800-3950, ఎరుపు రకం రూ. 4000,గుజరాత్ రకం రూ. 3950, బాక్స్ రకం రూ. 4000-4050, అరకిలో దిమ్మలు రూ. 4150, 200 గ్రాముల దిమ్మలు రూ. 4200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ శీతల గిడ్డంగులలో ఆగస్టు 12 నాటికి బెల్లం నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 6,78,893 నుండి పెరిగి 7,66,966 బస్తాలకు చేరగా ఇందులో పాపిడి 79,475 నుండి పెరిగి 1,26,554, చదరాలు 47,360 నుండి 76,762, చాకూ బెల్లం 3,36,622 నుండి 3,44,801 బస్తాలకు చేరగా, రసకట్ 28,086 నుండి తగ్గి 24,096, రాబిటన్ 1,82,017 నుండి 1,69,227, ఖురుపా 4244 నుండి 3518, లడ్డు బెల్లం 833 నుండి 435 బసాలకు పరిమితమయ్యాయి. మహారాష్ట్రలోని లాతూర్లో గత వారం 18-20 వాహనాల ఎసి సరుకు రాబడిపై సురభి రకం రూ. 4100-4200, మీడియం రూ.3800–3900,
సాంగ్లీలో 8-9 మేల దిమ్మలు సురభి రకం రూ. 4000-4200, గుజరాత్ రకం రూ. 4000-4100, ముంబై రక రూ. 4050-4200,
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో నలుపు రకం రూ. 3650-3700,
చిత్తూరులో 18–20 వాహనాల సరుకు అమ్మకంపై సూపర్-ఫైన్ రూ. 5000,
సురభి రకం రూ. 4900, నలుపు రకం రూ. 4400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.